Andhra Pradesh

News June 14, 2024

పెళ్లి సంబంధాలు.. కువైట్‌లో సోంపేట వాసి మృతి

image

సోంపేట మండలం జింకిభద్రకు చెందిన లోకనాథ్(31) నిన్న కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందాడు. చిరంజీవి, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు లోకనాథం ఉన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కువైట్‌కు వెళ్లి పనుల్లో చేరాడు. పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో నెల రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 8న బయలుదేరి వెళ్లాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News June 14, 2024

శ్రీ సత్యసాయి: రోల్‌వెల్ పరిశ్రమలో వ్యక్తి మృతి

image

హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని రోల్‌వెల్ పరిశ్రమలో శుక్రవారం ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. కొటిపి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(44) రోల్‌వెల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం విధులకు వెళ్లి మృతిచెందాడు. గుండెపోటుతో మృతి చెందాడా? లేక ప్రమాదం ఏమైనా సంభవించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 14, 2024

మదనపల్లెలో టీచర్ హత్య UPDATE

image

మదనపల్లెలో ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి <<13430375>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే.. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు మృతుని కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుమార్తే హత్యచేయించినట్లు సమాచారం అందగా..హత్య సమయంలో కూతురు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

గుంటూరు: జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా

image

గుజ్జనగుండ్ల సర్కిల్లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, నర్సింగ్ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్‌లతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాలని సూచించారు.  

News June 14, 2024

తూ.గో: ఘాటెక్కిన ఉల్లి ధర.. తగ్గిన దిగుమతులు

image

ఉల్లిపాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 పైన పలుకుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోజుకు 900 టన్నులు ఉల్లిపాయలను వినియోగిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు దిగుబడులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి రాజమండ్రి, రావులపాలెం, రాజోలు, మడికి, చొప్పెల్ల మార్కెట్లకు 30 లారీల్లో 600 టన్నులు మాత్రమే దిగుమతి జరుగుతోందని వారు తెలిపారు.

News June 14, 2024

శ్రీకాకుళం: మనస్తాపంతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

image

వీరఘట్టం మండలం బూరుగ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ(38) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ కృష్ణంనాయుడు గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన బాలకృష్ణను భార్యతో పాటు తన తల్లి మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 14, 2024

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

image

కృత్తివెన్నులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

విశాఖ: జూలై 29 నుంచి ప్రత్యేక లోక్ అదాలత్

image

సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారం కోసం జూలై 29 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ.గిరిధర్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు.

News June 14, 2024

తొలిరోజు పాఠశాలలకు 63.75 శాతం హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 రోజుల సెలవులు అనంతరం గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాలు పాఠశాలలు మొత్తం 3,055 ఉండగా.. వీటిల్లో తొలిరోజు 63.75 శాతం మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2,57,274 మంది విద్యార్థులు చదువుతుండగా.. తొలి రోజు 1,32,949 మంది హాజరై, 76,330 మంది గైర్హాజరయ్యారని డీఈవో కే.వెంకటేశ్వరరావు వెల్లడించారు.

News June 14, 2024

కోవూరు జాతీయ రహదారిపై ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

కోవూరు జాతీయ రహదారిపై ఆర్కే పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కు లారీని మామిడి కాయలు లోడుతో వస్తున్న మినీ ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా … క్లీనర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.