Andhra Pradesh

News April 7, 2024

ప.గో.: ఆయన గెలిచిన ప్రతిసారి కొత్తపార్టీ నుంచే..

image

భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరఫున బరిలో ఉన్న జనసేన అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు ఓ ప్రత్యేకతను కైవసం చేసుకున్నారు. 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి, 2014లో టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో టీడీపీ నుంచి పోటీ చేసినా.. ఓడిపోయారు. తాజాగా జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. గతంలో 2 వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందిన ఆయన తాజాగా మరోపార్టీ నుంచి బరిలో ఉన్నారు.

News April 7, 2024

మదనపల్లె: చెరువులో పడిపోయిన బొలెరో

image

మదనపల్లె సమీపంలోని తట్టివారిపల్లి చెరువులో బొలెరో వాహనం పడిపోయిన సంఘటన ఆదివారం జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. మండలంలోని, సీటీఎంరోడ్డు తట్టివారిపల్లి చెరువులోకి ఓ బొలెరో వాహనం దూసుకెళ్లింది. డ్రైవర్ తాగిన మైకంలో వాహనం నడిపడంతో బొలెరో అదుపుతప్పి చెరువులో పడిపోయింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

News April 7, 2024

ఒంగోలు రైల్వే ట్రాకుపై వ్యక్తి మృతి

image

ఒంగోలు రైల్వే స్టేషన్ కొత్తపట్నం ఫ్లైఓవర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. రైల్వే ట్రాకుపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించి రైల్వే అధికారులకు కొందరు సమాచారం అందించారన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను రాబట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2024

అనంతపురంలో టైలరింగ్ ఉచిత శిక్షణ

image

అనంతలోని రూడ్సెట్ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్, బ్యూటీ పార్లర్ శిక్షణ కల్పిస్తున్నట్లు డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20 నుంచి 30 రోజుల పాటు శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు చెందిన వారు 19 నుంచి 45 సం. వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News April 7, 2024

వినుకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

image

కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన వినుకొండ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం వినుకొండ కర్నూలు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా స్థానికులు వారిని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 7, 2024

బ్యాడ్మింటన్ ఆడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పర్యటించిన టీడీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడాకారులతో పాటు వాకర్స్ వారిని చప్పట్లతో ప్రోత్సహించారు.

News April 7, 2024

కర్నూలు: వెటర్నరీ అంబులెన్స్ డ్రైవర్ పోస్టుల భర్తీ

image

కర్నూలు పశుసంవర్ధక శాఖ, ఆరోగ్య సేవ వెటర్నరీ అంబులేటరీ సర్వీస్ (1962)లలో డ్రైవర్(పైలెట్) పోస్టులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని జీవీకే ఈఎంఆస్ఐ జిల్లా మేనేజర్ రామకృష్ణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి చదివి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, 36 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు www.ahd.gov.in సంప్రదించాలన్నారు.

News April 7, 2024

సీఎం రమేశ్‌కు 41ఏ నోటీసులు

image

అనకాపల్లి ఎన్డీఏ MP అభ్యర్థి సీఎం రమేశ్‌కు పోలీసులు శనివారం రాత్రి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఇటీవల చోడవరంలోని ఓ టైల్స్ షాప్‌లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా.. సీఎం రమేశ్ అక్కడికి చేరుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. సీఎం రమేశ్, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి రాజుతో పాటు ఆరుగురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

News April 7, 2024

వంశధార నదిలో అడుగంటిపోతున్న జలాలు

image

వేసవి కాలం ఆరంభం కావడంతో వంశధార నీటి జలాలు అడుగంటి పోతున్నాయి. దీనికితోడు కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో నదులు జల కళను కోల్పోతున్నాయి. తీర గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వంశధార ప్రాజెక్టుకు సైతం నీటి జాడలు తగ్గిపోతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న దాంట్లో 150 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా అధికారులు విడిచిపెడుతున్నారు.

News April 7, 2024

తవణంపల్లెలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలో శనివారం అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పులిచెర్లలో 43.6, ఎస్ఆర్ పురం 42.9, విజయపురం, నగరి, నిండ్ర 42.8,పుంగనూరు, బంగారుపాళ్యం 41.5,సోమల 41.4,చిత్తూరు, సదుం 41.2,పాలసముద్రం, గుడిపల్లె 41,కుప్పం 40.9,చౌడేపల్లె, యాదమరి,రొంపిచెర్ల, ఐరాల 40.8, జీడీనెల్లూరు, వెదురుకుప్పం 40.7,కార్వేటినగరం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!