India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మేడికొండూరులో జేసీబీ ఆపరేటర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై వాసు తెలిపిన వివరాలు ప్రకారం.. కాకినాడకు చెందిన వెంకన్న(48) పేరేచర్లలో జేసీబీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. గురువారం ఆయన నివసిస్తున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా వెంకన్న ఉరి వేసుకున్నట్లు కనిపించిందని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీ స్పీకర్ పదవి రేసులో ఉన్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేని సీతారామ్‌ను రవి ఓడించారు. చంద్రబాబు కేబినెట్‌లో శ్రీకాకుళం నుంచి అచ్చెన్నకు చోటు దక్కగా.. స్పీకర్ పదవి సైతం జిల్లా నేతకు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పీకర్ పదవికి రవితో పాటు అయ్యన్న, కళా వెంకట్రావు, తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మాజీ మంత్రి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాయకరావుపేట ఎమ్మెల్యే మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె అయ్యన్నను సత్కరించారు. మంత్రి పదవి చేపట్టిన అనితకు అయ్యన్న శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. అందరి సహకారం సమన్వయంతో విశాఖ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ(AU) పరిధిలో జనవరి- 2024లో జరిగిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చూడాలని AU పరీక్షల విభాగం తెలిపింది.

ధరలు లేక సతమతమవుతున్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా అంబాజీపేటలో జూలై 1వ తేదీ నుంచి నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం ఏపీ ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకరరావు అంబాజీపేటలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి దీనికి సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు YSR ఇంజనీరింగ్ కాలేజీ (వైవీయు)కి అదనంగా 130 సీట్లు AICTE మంజూరు చేసినట్లు కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య C.నాగరాజు గురువారం తెలిపారు. కాలేజీలోని 5 బ్రాంచ్‌లకు అదనంగా ప్రతి విభాగానికి 20 సీట్ల చొప్పున, మెటలర్జీ విభాగానికి 30 సీట్ల మొత్తం 130 అదనపు సీట్లకు AICTE అనుమతి ఇచ్చిందన్నారు. మే 20న AICTE కమిటీవారు వర్చువల్ పద్ధతిలో కాలేజీలోని అన్ని మౌలిక వసతులను తనిఖీ చేశారన్నారు.

యాస్పిరేషన్ బ్లాక్‌లుగా ఎంపికైన చిప్పగిరి, మద్దికెర (ఈస్ట్), హోళగుంద బ్లాక్‌ల అభివృద్ధి అంశాలపై పురోగతి సాధించాలని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం కలెక్టర్ సృజనకు సూచించారు. గురువారం ఢిల్లీ నుంచి నిర్వహించిన నీతి ఆయోగ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అభివృద్ధి అంశాలపై నీతి ఆయోగ్ సీఈవోకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు.

గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారనేది త్వరలోనే తెలియనుంది.

కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆమె గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆమె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుపాం నుంచి బరిలో నిలిచి మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై విజయం సాధించారు. దీంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయగా.. జడ్పీ సీఈవో ఆమోదించారు.

తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆయనకు ఇంకా శాఖ కేటాయించపోవడంతో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మరో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనగాని సత్యప్రసాద్‌కు ఏ శాఖ కేటాయిస్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.
Sorry, no posts matched your criteria.