India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో గురువారం పల్లకీ సేవ నిర్వహించినట్లు ఈవో ఉషశ్రీ తెలిపారు. ఆమె మాట్లాడుతూ… ప్రతి గురువారం పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు.

గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి కడప జిల్లాలో 289 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు 700లకు పైగా పోస్టులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆమె గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆమె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుపాం నుంచి బరిలో నిలిచి మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై విజయం సాధించారు. దీంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయగా.. జడ్పీ సీఈవో ఆమోదించారు.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఢిల్లీ కేంద్రంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తారని అన్నారు.

కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన ఇనకల్లు నరసింహం అనే యువకుడు రెండు రోజుల క్రితం గ్రామంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియచేసే ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సాయంత్రం ఆ కుటుంబాన్ని పరామర్శించి, నరసింహం తల్లి అనురాధను ఓదార్చారు. రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందించారు.

గంగవరం పోర్ట్ నిర్వాసితుల కార్మికుల బడాఖానా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీస్ కమిషనర్‌కు చక్కటి సన్మానం చేశారు. మత్స్యకారుడి వేషంలో ఒక చేత్తో వల, మరో చేతితో చేప, భుజం మీద బ్యాగు, నెత్తి మీద టోపీతో పోలీస్ కమిషనర్ రవిశంకర్ వినూత్నంగా కనిపించారు.

గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 337 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు వెయ్యి పోస్టుల వరకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

మిడుతూరు మండలం దేవనూరు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ (35) అనే రైతు పురుగు మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకి తీసుకొని అప్పులు చేసి పంటలు వేశారు. పంట నష్టం రావడంతో రూ.10 లక్షలు అప్పులయ్యాయి. చేసిన అప్పులు తీర్చలేమని రఫీ బాధపడేవారని.. దీంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబీకులు తెలిపారు.

మాజీ ఎంపీ మార్గాని భరత్ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారారని, ఆయన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర మాజీ ఎంపీ మురళీ మోహన్, భరత్ హయాంలో వేసిన శిలాఫలకాలను ఆదిరెడ్డి తన సొంత డబ్బులతో గురువారం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భరత్ అభివృద్ధి పేరిట నగరంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పలు కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. ఏయే ఫలితాలు విడుదల అయ్యాయంటే.. ☞ ఫార్మ్-డీ 1వ సెమిస్టర్ ☞ LLB కోర్సు 5వ సెమిస్టర్ ☞ బీ ఫార్మసీ 1వ సెమిస్టర్
Sorry, no posts matched your criteria.