Andhra Pradesh

News June 13, 2024

భోగాపురంపై రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

image

పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయానికి అశోక్ గజపతిరాజు హయాంలో పునాది పడిందని.. గత 5 ఏళ్లలో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి రికార్డు సమయంలో విమానాశ్రయాన్ని పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

News June 13, 2024

తూ.గో: బాలికపై తాత లైంగిక దాడికి యత్నం

image

రంపచోడవరం నియోజకవర్గ పరిధి అడ్డతీగల మండంలోని ఓ గ్రామంలో 6 ఏళ్ల బాలికపై తాత వరసయ్యే చిన్నారెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడ్డట్లు ఎస్సై అప్పలరాజు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. బాలిక బుధవారం ఇంటి బయట ఆడుకుంటుంది. ఆమెకు పనసతొనలు ఇస్తానని ఆశచూపి ఇంటి పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా.. తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పింది. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News June 13, 2024

అనంత: అరటి తోటలో మృతదేహం లభ్యం

image

నార్పల మండలం పప్పూరు గ్రామంలోని అరటి తోటలో మృతదేహం లభ్యమైంది. మృతుడు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రాంమోహన్ రెడ్డిగా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నార్పల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే అప్పులు బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది

News June 13, 2024

కర్నూలు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఉద్యోగుల వినతి

image

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో కొనసాగించేందుకు కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పీ.రామచంద్ర రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో మంత్రిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు రామచంద్రరావు తెలిపారు.

News June 13, 2024

జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ పదవికి రాజీనామా

image

కోవూరు వైసీపీ నేత, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు పదవికి దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీనామా చేసిన పత్రాన్ని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో పదవులకు రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు. రాజీనామాను ఆమోదించాలని కోరారు.

News June 13, 2024

మార్కాపురం: బావిలో మహిళ మృతదేహం 

image

మార్కాపురం మండలంలోని పిచ్చిగుంట్లపల్లి గ్రామ శివారులో పాడుబడిన బావిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వెంకటేశ్వర నాయక్ మృతి చెందిన మహిళను యాచకురాలిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

బద్వేలు: ప్రమాదమా.. ఆత్మహత్య?

image

బద్వేలులో గురువారం అగ్ని ప్రమాదంలో <<13432512>>సాయికుమార్ రెడ్డి<<>> మృతి చెందిన విషయం తెలసిందే. అయితే సాయికుమార్ రెడ్డి ప్రేమ విఫలం అవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనపై సీఐ యుగంధర్ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార డ్యూటీకి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ మృతి

image

విజయవాడలో నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార విధుల నిర్వహణకు వచ్చిన కానిస్టేబుల్ మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఏ లక్ష్మయ్య రెడ్డి నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార బందోబస్త్‌లో పాల్గొన్నాడు. అనంతరం అనారోగ్యం కారణంగా నేటి ఉదయం 5.30 సమయంలో విజయవాడలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామైన పోలాకి (M) పల్లిపేటకు తరలించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

News June 13, 2024

ముగిసిన చంద్రబాబు తిరుమల పర్యటన

image

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన తిరుచానూరుకు వచ్చారు. అక్కడ అమ్మవారి దర్శనం అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు వీడ్కోలు పలకగా.. ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరుగు ప్రయాణమయ్యారు.

News June 13, 2024

రేణిగుంట: ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు లభించింది. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.