Andhra Pradesh

News June 13, 2024

సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో మంత్రి సంధ్యారాణి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. శాఖలు కేటాయించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రిని సూచించారు.

News June 13, 2024

పుంగనూరులో పొట్టేళ్లకు భలే గిరాకీ

image

పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం పొట్టేళ్ల సంత జరిగింది. బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేళ్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో జత పొట్టేళ్లు ధర రూ. 40 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు పలికింది. పొట్టేళ్ల సంతకు కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. దీంతో సంతలో సందడి నెలకొంది.

News June 13, 2024

కృష్ణా: ఒక్క సంతకంతో 4.78లక్షల మందికి లబ్ధి

image

సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ అనంతరం నేడు పింఛను రూ.4 వేలకు పెంచుతూ.. మూడో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సంతకంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఉన్న 4,78,736 మందికి జూలై నుంచి పెరిగిన పింఛన్ సొమ్ము అందనుంది. కాగా అధికారిక డాష్‌బోర్డు సమాచారం ప్రకారం జూన్ నాటికి మొత్తంగా కృష్ణా జిల్లాలో 2,42,856, ఎన్టీఆర్ జిల్లాలో 2,35,880 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.

News June 13, 2024

గెలుపోటములు సహజం: వైవీ సుబ్బారెడ్డి

image

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులను అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News June 13, 2024

మాకు ఉద్యోగ భద్రత కల్పించండి: రామచంద్రరావు 

image

ప్రభుత్వ మద్యం దుకాణం సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. బెవరేజెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రామచంద్రరావు విజయవాడలో గురువారం మంత్రి జనార్దన్‌రెడ్డి,, శ్రీనివాసరావుని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. వైన్ షాప్‌లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, జీతభత్యలు ఎవరు చెల్లిస్తున్నారంటూ వాకబు చేశారు. అనంతరం ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. 

News June 13, 2024

మరి కాసేపట్లో దుర్గమ్మని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 2.40నిమిషాల మధ్యలో అమ్మవారిని దర్శించుకోనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. అనంతరం రోడ్డు మార్గాన ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్ళనున్నట్లు సమాచారం.

News June 13, 2024

గుంటూరు: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన లారీ

image

రహదారిపై వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో జరిగింది. గురువారం కొమ్మూరు గ్రామంలో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 13, 2024

టెక్కలిలో YCP నాయకుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

టెక్కలికి చెందిన వైసీపీ నాయకుడు నర్సింగ్ నాధ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టెక్కలి సీఐ పీ పైడయ్య తెలిపారు. గత నెల 13వ తేదీన పోలింగ్ బూత్ వద్ద జరిగిన తగాదా విషయంలో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్కలికి చెందిన నర్సింగ్ నాధ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రిమాండ్ విధించడంతో నరసన్నపేట ఉప కారాగారానికి తరలించారు.

News June 13, 2024

ఉదయగిరి: మేకను రక్షించబోయి వ్యక్తి మృతి

image

ఉదయగిరి మండలం శకునాలపల్లి గ్రామంలోని ఓ బావిలో పడిన మేకను రక్షించబోయి యజమాని ప్రాణాల కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఈర్ల వెంకటయ్య (75) తన మేకలు, గొర్రెలను మేత కోసం అడవిలోకి తీసుకువెళ్లాడు. ఆ క్రమంలో ఓ మేక వ్యవసాయ బావిలో పడింది. దానిని రక్షించే క్రమంలో బావిలో ఉన్న తామర తుట్టేల్లో చిక్కుకుపోయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 13, 2024

రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ పదవికి రాజీనామా

image

రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ పదవికి బేతంచెర్లకు చెందిన వైసీపీ నేత ముర్తుజా వలి గురువారం రాజీనామా చేశారు. 2023 జూన్‌లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తోడ్పాటుతో ఈ పదవిని చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పదవికి రాజీనామా చేసినట్లు ముర్తుజా వలి వెల్లడించారు. తనకు పదవి రావడానికి సహకరించిన మాజీ మంత్రి బుగ్గనకు ధన్యవాదాలు తెలిపారు.