Andhra Pradesh

News March 31, 2024

కర్నూలులో ఏడాది క్రితం మిస్సైన మూడు కూనలు హైదరాబాద్‌లో సేఫ్

image

కర్నూలు జిల్లాలో 2023 మార్చిలో నాలుగు పులి పిల్లలు మిస్ అయ్యాయి. అయితే వాటిని తిరుపతి SV జూ పార్క్‌కు తరలించి అధికారులు సంరక్షించారు. వాటిలో ఒకటి మరణించగా మరో మూడింటికీ రుద్రమ్మ, అనంత, హరిణి అని పేరు పెట్టారు. వీటిని ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన జీఏఆర్ సంస్థ ఏడాది పాటు దత్తత తీసుకుంది. గడువు ముగిస్తే మళ్లీ అధికారుల ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని SVజూపార్క్ క్యూరేటర్ సెల్వం తెలిపారు.

News March 31, 2024

నూజివీడు అసెంబ్లీకి 72 ఏళ్లలో ఐదుగురే అభ్యర్థులు

image

నూజివీడు నియోజకవర్గం నుంచి 72 ఏళ్లలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థులు, 3 సామాజిక వర్గాలు మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించాయి. 1952 నుంచి 1972వరకు డాక్టర్ ఎంఆర్ అప్పారావు, 1978, 1989లో పాలడుగు వెంకటరావు, 1983, 1985, 1994, 1999లో కోటగిరి హనుమంతరావు, 2004, 2014, 2019లో మేక వెంకట ప్రతాప్ అప్పారావు, 2009లో చిన్నం రామకోటయ్య గెలుపొంది ప్రాతినిధ్యం వహించారు.

News March 31, 2024

నేడే చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌

image

చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఆదివారం జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఊపుమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ప్రవేశ ద్వారాల వద్ద వైఫైతో కూడా స్కానర్‌ బోర్డులను ఏర్పాటుచేశారు. మ్యాచ్‌ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.

News March 31, 2024

భీమవరంలో మావోయిస్టు అరెస్ట్

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ మావోయిస్టును పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఝార్ఖండ్‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రాహుల్ కేసరి అనే మావోయిస్టు తప్పించుకున్నాడు. కొద్దిరోజులు అతడు HYDలో తలదాచుకొని, 15 రోజుల కింద భీమవరం వచ్చి వలస కార్మికులతో తాపీ పనులు చేస్తున్నాడు. ఫోన్ ఆధారంగా భీమవరం వచ్చిన ఝార్ఖండ్ పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు.

News March 31, 2024

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ బాబు ఎంపిక

image

సత్తెనపల్లి:
బహుజన సమాజ్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరుపోగు నవీన్ బాబు ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి ప్రకటించారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయవతి ఆదేశాల మేరకు తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండోవ జాబితాను విడుదల చేసారు. ఈ జాబితాలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గా నవీన్ బాబు ను ఖరారు చేసారు.

News March 31, 2024

శ్రీకాకుళంలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసినట్లు డీఈఓ వేంకటేశ్వరరావు తెలిపారు. పలాస మండలం పెద్దంచల గ్రామానికి చెందిన టీచర్ బెహరా మాధవరావు రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు ధ్రువీకరించారు. సారవకోట మండలం మొగుపురం గ్రామానికి చెందిన టీచర్ చౌదరి లక్ష్మీనారాయణ వాట్సాప్‌లో ప్రచారం చేసినట్లు ఎంఈఓ ధ్రువీకరించి ఇద్దరిని సస్పెండ్ చేశారు.

News March 31, 2024

ప్రకాశం జిల్లా ఎన్నికల బరిలో ఒకే ఒక మహిళ

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలలో ఒకేఒక మహిళా అభ్యర్థి పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల బరిలో ఉన్నారు.వైసీపీ నుంచి ఎవరు పోటీలో లేరు. దీంతో జిల్లాలో మహిళా అభ్యర్థి గెలుపుపై పార్టీలు లెక్కలేసుకుంటున్నారు.

News March 31, 2024

చిత్తూరు: వడ్డీ మాఫీకి నేడే ఆఖరు

image

2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులపై వడ్డీ మాఫీకి ఆదివారం ఆఖరు రోజు అని, ఈ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ డా. జె అరుణ కోరారు. పన్ను బకాయిల మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ఉంటుందన్నారు. ఆదివారం రోజైనా నగరపాలక కార్యాలయంలోని పురసేవ కేంద్రం పనిచేస్తుందన్నారు.

News March 31, 2024

విశాఖలో విద్యార్థిని ఆత్మహత్య.. విచారణకు కమిటీ

image

విశాఖలో చైతన్య పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని బలవన్మరణంపై సాంకేతిక విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. సంఘటనపై విచారణ జరిపి 24 గంటలలోగా నివేదిక అందించాలని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ నేతృత్వంలో విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ మెటలర్జీ విభాగాధిపతి రత్నకుమార్, సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్ రాజ్యలక్ష్మి విచారణ చేయనున్నారు.

News March 31, 2024

సీఎస్ఆర్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ విరాళాలతో కొంత భాగాన్ని ఆయా కంపెనీలు కొలువై ఉన్నచోట కొంతమేర ఖర్చు చేయాలని కలెక్టర్ పీ.అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నందు కియా కంపెనీ అనుబంధ సంస్థ Hyundai Mobis కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో రూ.44,13,436 విలువ గల పరికరాలు కలెక్టర్ పి.అరుణ్ బాబుకు అందజేశారు.

error: Content is protected !!