Andhra Pradesh

News March 30, 2024

తూ.గో.: CM సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన ఇన్‌ఛార్జి

image

కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ శనివారం వైసీపీలో చేరారు. అనంతపురం జిల్లాలో సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పర్యటించిన సీఎం జగన్‌ను పితాని బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పితాని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా జగన్ ఓదార్చారు. ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ పాల్గొన్నారు.

News March 30, 2024

ప్రొద్దుటూరు అసంతృప్తులపై చంద్రబాబు స్పందన

image

చంద్రబాబు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఉక్కు ప్రవీణ్ గురించి ప్రస్తావించారు. పార్టీ కోసం ప్రవీణ్ చాలా కష్టపడ్డాడని, రెండు సార్లు జైలుకు వెళ్లాడని అతడికి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీఎం సురేశ్‌ పార్టీకి సహకరించారని. ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేకపోయా తప్పకుండా అతనికి న్యాయం చేస్తానన్నారు. లింగారెడ్డి, ఇతర నాయకులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

News March 30, 2024

VZM: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

image

పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మక్కువ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి పి మురళి, సాల్విన్ సర్టిఫికెట్ నిమిత్తం చీకటి గణపతి అనే వ్యక్తి నుంచి రూ.2,600 తీసుకుంటూ ఏసీబీ డిఎస్పీ, సిబ్బందికి దొరికాడు. దీనిపై ఏసీబీ కేసు నమోదుచేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2024

చంద్రబాబుపై కావలి ఎమ్మెల్యే ఫైర్

image

మాజీ సీఎం చంద్రబాబుపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తాను భూకబ్జాలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి విరమించుకుంటానని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరో రాసి పంపిన స్క్రిప్ట్ చదవడం విడ్డూరంగా ఉందన్నారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏమి అభివృద్ధిలో చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

News March 30, 2024

కాశినాయన: 23 మంది వాలంటీర్లు రాజీనామా

image

కాశినాయన మండలం నరసాపురం సచివాలయం పరిధిలోని 23 మంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో నరసాపురం, మిద్దెల, మూలపల్లి, నరసన్నపల్లి గ్రామాల వాలంటీర్లు ఉన్నారు. తామంతా వైసీపీ గెలుపు కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేశామని వారు తెలిపారు.

News March 30, 2024

అనంత: పరిటాల సునీత సమక్షంలో టీడీపీలోకి చేరికలు

image

రామగిరి మండలం కొత్తగాదిగకుంట గ్రామానికి చెందిన వైసీపీ జిల్లా కార్యదర్శి S.చిన్న పెద్దన్న శనివారం పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటూ అదే గ్రామానికి చెందిన బీజేపీ రామగిరి మండల కన్వీనర్ గొల్ల కృష్ణయ్య, వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సునీత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు.

News March 30, 2024

విశాఖ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08579/08580) రైళ్లను జూన్‌ 27 వరకు, విశాఖ-తిరుపతి-విశాఖ రైళ్లను జూన్‌ 25 వరకు, విశాఖ-కర్నూలు-విశాఖ రైళ్లను జూన్‌ 26 వరకు పొడిగించినట్లు తెలిపింది.

News March 30, 2024

MLA రాచమల్లు ఒక ముళ్లు: చంద్రబాబు

image

ప్రొద్దుటూరు బహిరంగ సభలో చంద్రబాబు ఎమ్మెల్యే రాచమల్లుపై విమర్శలు గుప్పించారు. రాచమల్లు ఒక ముళ్లు అని ప్రజలను గుచ్చుతూనే ఉంటారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో మట్కా, జూదం, ఇసుక, సెటిల్ మెంట్ లో, నకిలీ నోట్లు ఇలా అన్నింటిలో అవినీతిలో ఉన్నారని అన్నారు. టెక్నాలజీ దుర్మార్గుడి చేతిలో ఉంటే ప్రజలు ఆగం అవుతారన్నారు. రాజమల్లు రూ.2 వేల కోట్లు అవినీతితో సంపాదించారని ఆరోపించారు.

News March 30, 2024

తిరుపతిలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే రక్షణ దళం విశ్రాంతి కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఎస్ఆర్ పురం మండలం పాపిరెడ్డి పల్లికి చెందిన ఈదల రవి(55) గా గుర్తించారు. పుత్తూరు, తిరుపతి ప్రాంతాలలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య గీత, కుమారుడు బెంగుళూరులో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

News March 30, 2024

గోపాలపురంలో గెలిచిన మహిళా అభ్యర్థులు వీరే

image

ప.గో జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు(1962-2019) 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 3సార్లు మహిళలు MLAలుగా గెలిచారు. 1978లో దాసరి సరోజినిదేవి(కాంగ్రెస్‘ఐ‘), 2004లో మద్దాల సునీత(కాంగ్రెస్‘ఐ’), 2009లో తానేటి వనిత(TDP) నుంచి గెలుపొందారు. ఇక్కడి నుంచి వనిత మరోసారి MLA అభ్యర్థిగా బరిలో ఉంటుండగా.. ఈసారి పార్టీ మాత్రం వేరు. ఆమె 2009లో TDP నుంచి పోటీ చేసి గెలవగా.. ఈసారి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.

error: Content is protected !!