India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలకొల్లు నియోజకవర్గానికి 30 ఏళ్ల తర్వాత మరోసారి మంత్రి పదవి దక్కింది. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హరిరామజోగయ్య మర్రి చెన్నారెడ్డి జట్టులో పౌరసంబంధాలు, అటవీశాఖ మంత్రిగా చేశారు. తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో చిన్నతరహా పరిశ్రమలు, భూగర్భగనుల శాఖ దక్కింది. ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్నికైనా మంత్రి పదవి దక్కలేదు. తాజాగా హాట్రిక్ వీరుడు రామానాయుడు మంత్రిగా ప్రమాణం చేయడం విశేషం.

నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. గురువారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో ఆమె ప్రైవేటు పాఠశాలలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ప్రైవేటు పాఠశాలల తప్పకుండా పాటించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చే ముందు ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు.

అధికారుల నిర్లక్ష్యం, దూరదృష్టి లోపంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. యాడికి మండలం పెద్దపేట గుండా వెళ్లే రాష్ట్రీయ రహదారి వానొస్తే చాలు వాగులా మారుతోంది. పెద్దపేట ఎస్సీ కాలనీ వద్ద రహదారి మడుగులా మారుతోందని, వాహనాల రాకపోకలకు, చోదకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రెండేళ్లుగా ఈ దుస్థితి ఇలాగే కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

విషం తాగి యువతి మృతి చెందిన ఘటన రాజమండ్రిలోని ప్రకాశంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. పోలవరం మండలం తోటగుందికి చెందిన యువతి(21) బీఎస్సీ చదివింది. స్నేహితురాలి పెళ్లికని తల్లికి చెప్పి ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లింది. 10న తల్లికి ఫోన్ చేసి ‘నేను రాజమండ్రి బస్టాండ్‌లో ఉన్నా. విషం తాగా..’ అని చెప్పింది. వెళ్లి ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

పాడేరు ఘాట్‌లో సౌండ్ సిస్టం లోడుతో వెళ్తున్న వ్యాన్ బుధవారం బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తన బిడ్డను రక్షించుకునేందుకు ఓ తల్లి సాహసం చేసింది. వ్యాన్ కింద నలిగిపోతున్న బిడ్డకు ఏమీ కాకుండా కౌగిలిలో వదలకుండా పట్టుకుంది. దీంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డకు ఏమీ కాకుండ తల్లి చేసిన సాహసాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.

ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి దారుణ హత్యకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికంకాలనీ, ఆంజనేయస్వామి గుడి వద్ద కాపురం ఉంటున్న టీచర్ దొరస్వామి(62)ని ఎవరో ఆయన ఇంటిలోనే మరణాయుధాలతో దారుణంగా హత్యచేసి పరారయ్యారు. మృతదేహాన్ని 1టౌన్, తాలూకా సీఐ వల్లి భాష, శేఖర్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్‌ఎండీ ఫరూక్ నాలుగోసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉమ్మడి జిల్లాలో రహదారులు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. వాటి మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తా. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. కర్నూలు నుంచి నంద్యాలకు నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. పలు పరిశ్రమలు రావడానికి కృషి చేస్తా’ అన్నారు.

ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి దారుణ హత్యకు గురైన ఘటన మదనపల్లెలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికంకాలనీ, ఆంజనేయస్వామి గుడి వద్ద కాపురం ఉంటున్న టీచర్ దొరస్వామి(62)ను ఎవరో తన ఇంటిలోనే పథకం ప్రకారం మరణాయుధాలతో దారుణంగా హత్యచేసి పరారయ్యారు. మృతదేహాన్ని 1టౌన్, తాలూకా సిఐలు వల్లి భాష, శేఖర్ లు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

CBN మంత్రివర్గంలో ఉమ్మడి కృష్ణా నుంచి ఇద్దరికి చోటు దక్కగా కొందరు సీనియర్లకు స్థానం లభించలేదు. అవనిగడ్డ నుంచి 4వ సారి అసెంబ్లీకి ఎన్నికైన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు కేబినెట్ చోటు దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. మంత్రివర్గంలో మండలికి చోటు దక్కకపోవడంతో ఆయనకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు మరోసారి పొడిగించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సెలవులను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. తాజాగా విశ్వవిద్యాలయంలోని కళాశాలలు ఈనెల 18 నుంచి పునఃప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ కరుణ ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.