Andhra Pradesh

News June 12, 2024

ఇచ్ఛాపురం: రైలు నుంచి జారిపడి యువకుడి దుర్మరణం

image

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఇచ్ఛాపురం దాసన్నపేట మెయిన్ రోడ్డులో నివాసం ఉన్న కస్పా రాజేష్ (32) హైదరాబాదులో ఒక ప్రైవేట్ జిమ్‌లో శిక్షకుడిగా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా సింహాచలం దర్శనానికి ఇచ్ఛాపురం వస్తుండగా శ్రీకాకుళం పరిసరాలలో రైలు నుంచి జారి పడిన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య పద్మ, ఒక కుమారుడు ఉన్నారు.

News June 12, 2024

తాడిపత్రి: ఇది చెరువు కాదు.. కళాశాల క్రీడామైదానం.!

image

తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం జలమయమైంది. పట్టణంలోని విద్యార్థులకు, క్రీడాకారులకు ఇదొక్కటే క్రీడా మైదానం. చిన్నపాటి వర్షాలకే మడుగులా మారుతోంది. విద్యార్థులు ఆటలకు దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డైలీ వాకర్స్ సైతం నీరు నిలిచి ఉండడంతో వాకింగ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.

News June 12, 2024

మాచవరం: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామస్వామి (35) అనే వ్యక్తి పొలంలో పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 12, 2024

I LOVE కైలాసగిరి

image

పర్యాటకులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా ఆధునిక హంగులతో కైలాసగిరిపై I LOVE కైలాసగిరి పేరుతో నూతనంగా వ్యూ పాయింట్‌ నిర్మించారు. పెద్దపెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన బోర్డులను విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. రాత్రి వేళల్లో వెలుగులు వచ్చేలా విద్యుత్ దీపాలను కూడా అమర్చారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఉన్న ఐ లవ్ వైజాగ్ బోర్డులు మాదిరిగానే నూతనంగా దీనిని నిర్మించారు.

News June 12, 2024

గుండెపోటుతో గరగపర్రు వీఆర్వో మృతి

image

పాలకోడేరు మండలం గరగపర్రు వీఆర్వోగా పని చేస్తున్న సంపద స్వామి నాయుడు (48) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఆయనకు మైల్డ్ స్ట్రోక్ రావడంతో భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం స్ట్రోక్ ఎక్కువే మృతి చెందడం జరిగింది. దీనిపై వీఆర్వోల సంఘం, భీమవరం ఎమ్మార్వో ఆర్ఐలు తమ సంతాపం వ్యక్తం చేశారు.

News June 12, 2024

I LOVE కైలాసగిరి

image

పర్యాటకులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా ఆధునిక హంగులతో కైలాసగిరిపై I LOVE కైలాసగిరి పేరుతో నూతనంగా వ్యూ పాయింట్‌ నిర్మించారు. పెద్దపెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన బోర్డులను విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. రాత్రి వేళల్లో వెలుగులు వచ్చేలా విద్యుత్ దీపాలను కూడా అమర్చారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఉన్న ఐ లవ్ వైజాగ్ బోర్డులు మాదిరిగానే నూతనంగా దీనిని నిర్మించారు.

News June 12, 2024

VZM: మంత్రివర్గ సమావేశంలో కొండపల్లి

image

ఉండవల్లి లోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పలు అంశాలపై తమతో చర్చించారని మంత్రి కొండపల్లి ఈ సందర్భంగా తెలిపారు. మంత్రిగా నిర్వహించాల్సిన బాధ్యతలపై చంద్రబాబు తమకి అవగాహన కల్పించారని మంత్రి తెలిపారు.

News June 12, 2024

శ్రీకాకుళం: విజయనగరంపై విశాఖ జట్టు విజయం

image

టెక్కలిలో జరుగుతున్న అండర్-23 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో రెండో రోజు విజయనగరం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 338 పరుగులు చేయగా తదుపరి బ్యాటింగ్ చేసిన విజయనగరం జట్టు 274 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీనితో 64 పరుగులతో విశాఖ జట్టు గెలుపొందింది. ఆర్గనైజింగ్ కన్వీనర్‌గా ఎన్.లాల్ బహుదూర్ వ్యవహరించారు.

News June 12, 2024

VZM: 40% వైన్ షాపులు కేటాయించాలని డిమాండ్

image

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు వైన్ షాపులను కేటాయిస్తామన్న హామీని అమలు చేయాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం సీఐటీయూ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన షాపుల్లో 40 శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించాలన్నారు. యాత కులస్థులకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. 

News June 12, 2024

కర్నూలు: చంద్రబాబు సమీక్షలో జిల్లా మంత్రులు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.