India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సవిరిగాం గ్రామానికి చెందిన IAS అధికారి ముద్దాడ రవిచంద్రకు అరుదైన అవకాశం లభించింది. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ, CMO కార్యాలయం చీఫ్‌గా నియమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి స్వీకరణ అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరించారు.

యోగి వేమన యూనివర్సిటీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంపీఈడీ (పీజీ) 2, 4 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. 2వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28, జులై 1, 3, 5, 8, 10 తేదీలలో, 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 29, జులై 2, 4, 6, 9, 11 తేదీలలో జరుగుతాయన్నారు. వీటితోపాటు ఎంబీఏ పరీక్షలు మొదలవుతాయన్నారు.

కలెక్టరేట్ ఆవరణలో జూన్ 15వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2 ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు కలవన్నారు. ఆసక్తిగల 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పాసైన 35 సంవత్సరాల లోపు వారు జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. జీతం రూ 11 వేల నుంచి 13 వేల వరకు ఉంటుందన్నారు. ఉద్యోగం సాధించిన వారికి భోజనం, వసతి కలదన్నారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి చంద్రబాబు తిరుపతి, తిరుమల పర్యటన చేయనున్నారు. ఇవాళ రాత్రికి ఆయన తిరుమలకు చేరుకుంటారు. ఈ సందర్భంగా డీఐజీ షిముషి బాజ్ పాయ్ అధ్వర్యంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితర అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. సీఎం పర్యటన కోసం 1550 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. కొండపై క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

CM చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 9 గం.కు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. తిరుమలలోని శ్రీగాయత్రి నిలయం గెస్ట్‌హౌస్‌లో బసచేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. CM తిరుపతి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.

ప.గో జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని పీహెచ్సీల వైద్య అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో నూరు శాతం డెలివరీలు జరగాలని, తక్కువగా డెలివరీలు జరుగుతున్న ఆస్పత్రులను సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని డీఎం అండ్ హెచ్‌ఓకు సూచించారు. పేషెంట్ల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని అన్నారు.

పాడేరు ఘాట్ రోడ్ 12 మైళ్ళ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాడేరు మోదకొండమ్మ జాతరకు సౌండ్, లైటింగ్ సిస్టమ్స్ తెచ్చి తిరిగి వైజాగ్ వెళుతుండగా డీసీఎం లారీ బ్రేకులు ఫెయిలై లోయలోకి దూసుకుపోయింది. లారీలో ఉన్న 11 మంది ప్రమాదానికి గురయ్యారు. వారిలో కనిపించిన ఆరుగురిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురు లోయలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 15న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు తమ పేర్లను ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్య్లూ.ఎన్‌సిఎస్.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌లోని జాబ్ సీకర్స్ లాగిన్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజులరెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి లభించలేదు. ఈయన 1985లో TDP తరఫున గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1989లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు MLAగా విజయం సాధించారు. తిరిగి ఈ ఎన్నికల్లో 22,744 మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఈయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు ఆశించారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించకపోవడంతో నిరాశ చెందారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ ఆయన చాంబర్లో కార్మిక, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోస్టల్ విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.