Andhra Pradesh

News June 12, 2024

ఈఏపీ సెట్‌లో సత్తా చాటిన అనంత జిల్లా విద్యార్థులు

image

ఈఏపీసెట్‌లో ఉమ్మడి అనంత జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఔషధ విభాగంలో తలుపుల మండలానికి చెందిన దివ్యతేజ 2వ ర్యాంకు, అనంతపురం గణేశ్ నగర్‌కు చెందిన భాను తేజసాయి 6వ, ఇంజినీరింగ్ విభాగంలో సతీశ్ రెడ్డి 4వ, కుశాల్ కుమార్ 8వ, యాడికికి చెందిన సాయిజశ్వంత్ రెడ్డి 61వ ర్యాంక్ సాధించారు. తాడిపత్రికి చెందిన సాయి హనీశ్ రెడ్డి 28వ, పెద్దవడుగూరు మండలం తెలికికి చెందిన అనీషా 187వ ర్యాంకు సాధించారు.

News June 12, 2024

మోదీ ఆశీస్సులు తీసుకున్న రామ్మోహన్ నాయుడు

image

అమరావతిలో జరిగిన సీఎం చంద్రబాబు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తుండగా.. రామ్మోహన్ ఆయనకు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రామ్మోహన్ భుజం తట్టారు.

News June 12, 2024

మూకుమ్మడిగా ముక్కంటి మండలి రాజీనామా

image

శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు వారి వారి పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మండల సభ్యులు కొంతమంది మరుసటి రోజు రాజీనామా చేశారు. అయితే మరి కొంతమంది సభ్యులు, అధ్యక్షులు రాజీనామా చేయకపోవడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎట్టకేలకు ఆలయ ధర్మకర్తల మండలి మూకుమ్మడిగా రాజీనామా చేసి ఆ పత్రాన్ని ఆలయ ఈఓకి అందజేశారు.

News June 12, 2024

మంత్రిగా మండిపల్లి ప్రమాణ స్వీకారం

image

రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.

News June 12, 2024

సవిత అనే నేను..

image

పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ‘సవిత అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’ అంటూ మొదలు పెట్టి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. కాగా.. ఈమెకు మంత్రి పదవి రావడం తొలిసారి.

News June 12, 2024

కొండపల్లి శ్రీనివాస్ అనే నేను..

image

గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీనివాస్‌తో పదవీ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపైన ఉన్న మోదీతో సంభాషించిన శ్రీనివాస్.. పెద్దలకు నమస్కరించారు.

News June 12, 2024

టీజీ భరత్ అనే నేను..

image

కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయనకు మంత్రి పదవి రావడం తొలిసారి. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీకి నమస్కరించి కాసేపు ముచ్చటించారు.

News June 12, 2024

గుమ్మడి సంధ్యారాణి అనే నేను..

image

సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సంధ్యారాణితో పదవీ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపైన ఉన్న పెద్దలకు ఆమె నమస్కరించారు.

News June 12, 2024

మంత్రిగా గొట్టిపాటి ప్రమాణ స్వీకారం

image

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ గొట్టిపాటి రవి కుమార్ అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.

News June 12, 2024

మంత్రిగా డోలా ప్రమాణ స్వీకారం

image

కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ డోలా బాల వీరాంజనేయస్వామి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.