India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లెలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పయ్యావుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ‘పయ్యావుల కేశవ్ అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత ర్యాగ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’ అంటూ మొదలు పెట్టి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. కాగా పయ్యావులకు మంత్రి పదవి రావడం తొలిసారి.

రాష్ట్ర మంత్రిగా నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంలో జిల్లాకు చెందిన ఆయన అభిమానులు, జన సైనికులు, వీరమహిళలు నినాదాలు చేశారు.

మంత్రిగా పొంగూరు నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లెలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గెలిచిన విషయం తెలిసిందే.

రాష్ట్ర మంత్రిగా ప.గో. జిల్లా పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలం కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంలో జిల్లాకు చెందిన ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు.

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అనితతో పదవీ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపైన ఉన్న పెద్దలకు అనిత నమస్కరించారు.

వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ఎంజీఆర్ యూనివర్సిటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న కనగళ్ల గౌరీశ్ (21) రామాపురం బీచ్‌లో సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. సముద్ర స్నానాలు చేస్తుండగా అలలు తాకిడికి గౌరీశ్ గల్లంతయ్యాడు. కొద్దిసేపటికి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. ఆమె తమ్ముడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేసరపల్లిలోని చంద్రబాబు ప్రమాణస్వీకారానికి విచ్చేసిన ఆమె వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన అక్క భువనేశ్వరి భుజం తట్టి నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టారు. ఈ దృశ్యం వేదికపై కూర్చున్నవారిని ఆకట్టుకుంది.

ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వాహనంలో కేసరపల్లికి బయల్దేరారు. కొద్దిసేపటి కిందటే విమానాశ్రయంలో ప్రధానికి చంద్రబాబు, గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం వారు కేసరపల్లిలోని సభా స్థలికి బయల్దేరారు. 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వాహనంలో కేసరపల్లికి బయల్దేరారు. కొద్దిసేపటి కిందటే విమానాశ్రయంలో ప్రధానికి చంద్రబాబు, గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం వారు కేసరపల్లిలోని సభా స్థలికి బయల్దేరారు. 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.