India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డికు కేబినెట్లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. గతంలో వీరు మంత్రులుగా పనిచేశారు. నారాయణ గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయగా.. ఆనం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లానుంచి ఒక్కరికే కేబినెట్లో చోటుదక్కింది. టెక్కలి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడుకి మరోసారి మంత్రి పదవి వరించింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. కాగా రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కడం తెలిసిందే. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. కొల్లు రవీంద్ర(మచిలీపట్నం), పార్థసారథి(నూజివీడు)కు చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ గతంలో మంత్రులుగా పనిచేశారు. కొల్లు రవీంద్ర గత టీడీపీ ప్రభుత్వంలో, పార్థసారథి వైఎస్ఆర్ హయాంలో మంత్రులుగా సేవలందించారు.

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో ఒక్కరికి మంత్రి పదవి దక్కింది. పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలుపొందిన నిమ్మల రామానాయుడు మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ MLAగా రికార్డ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో నియోజకవర్గంలో 70 శాతం ఓటింగ్ పొంది.. జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగానూ గుర్తింపు పొందారు.

TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. నారా లోకేశ్(మంగళగిరి), నాదెండ్ల మనోహర్ (తెనాలి), అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)కు చోటు దక్కించుకున్నారు. అనగాని సత్యప్రసాద్ తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా.. లోకేశ్ గత TDP ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.

ఉమ్మడి అనంత జిల్లా నుంచి ముగ్గురిని మంత్రి పదవులు వరించాయి. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ (బీజేపీ), ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవితకు కేబినెట్‌లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. ఆ ఒక్కరూ మన ధర్మవరం ఎమ్మెల్యే కావడం విశేషం. వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

నూతన మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు మాత్రమే సీఎం హోదాలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మిగిలిన ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. సీనియర్ కోటాలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎస్సీ కోటాలో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామస్, మురళి మోహన్ పేర్లు వినిపించాయి. అలాగే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ పేరు తెరపైకి వచ్చినా.. ఎవరికీ పదవులు ఇవ్వలేదు.

సీఎంగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి. అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. బుధవారం ఉదయం 10.00 గంటల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందన్నారు.

కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానం వేదికగా జూన్ 30 నుంచి జులై 3వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ -3 క్రికెట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలు జూన్ 30వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతిరోజు 2 మ్యాచ్‌లు చొప్పున డే అండ్ నైట్ మ్యాచులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ అభిమానులు ఉచితంగా మ్యాచులను వీక్షించవచ్చు అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.