Andhra Pradesh

News August 22, 2024

అనకాపల్లిలో ప్రమాదం.. కాకినాడ జిల్లా వాసి విషాద గాథ ఇదీ

image

అనకాపల్లిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో సామర్లకోటకు చెందిన నాగబాబు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా 6 నెలల క్రితమే తండ్రి మృతిచెందాడు. తల్లి, సోదరులకు తానున్నానని ధైర్యం చెప్పి ఉద్యోగానికి వెళ్లాడు. ఇప్పుడు అతని మృతితో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. భార్య సాయితో పాటు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. విశాఖలోనే ఉంటూ ఎసెన్షియా కంపెనీలో ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

News August 22, 2024

విశాఖ: ఒక్కొక్కరికి 1.02 కోట్ల పరిహారం

image

అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంలో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దేశ ప్రధాని మోదీ సైతం స్పందించారు. మృతిచెందిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ ప్రకటించారు. మరోవైపు విశాఖ కలెక్టర్ మృతులకు రూ.కోటి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.1.02 కోట్లు అందనుంది.

News August 22, 2024

పెడన : ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు

image

పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులు కావాలని కళాశాల ప్రిన్సిపల్ కేసీఎన్ వీఎస్ రామారావు కోరారు. జనరల్ కామర్స్-1, వొకేషనల్ కామర్స్-1 పోస్టుకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఎంకాంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఈ నెల 23 సాయంత్రం 4గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 24న మచిలీపట్నం లేడీయాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డెమో, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

News August 22, 2024

నేడు శ్రీవారి పుష్పయాగం టికెట్ల విడుదల…

image

నవంబర్ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేడు పుష్పయాగం టికెట్లను 10 గంటలకు టిటిడి వారు విడుదల చేయనున్నారు. పుష్పయాగంలో పాల్గొనదలచిన భక్తులు టికెట్లను కొనుక్కొని పాల్గొనవచ్చు. పుష్పయాగంలో పాల్గొనడంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది. బ్రహ్మోత్సవాలకు ముందుగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

News August 22, 2024

నాయుడుపేటలో దారుణం.. నడి రోడ్డుపై పురిటి బిడ్డ

image

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజి కండ్రిక సమీపంలో పురిటి బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడవేసి వెళ్లారు. రోడ్డుపై పసికందు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పురిటి బిడ్డ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.

News August 22, 2024

విజయనగరం జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమెన్ పీఎస్‌లో పనిచేస్తున్న నారాయణరావుకు గుర్ల, 1టౌన్ తారకేశ్వరరావును బాడంగి, పీటీసీలో ఉన్న ప్రసాద్‌ను రామభద్రపురం, గరివిడి దామోదర్‌ను చీపురుపల్లి, బుదరాయవలస లోకేశ్వరరావును గరివిడి పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని SP ఆదేశించారు.

News August 22, 2024

మృతుల్లో ఎక్కువమంది యువకులే..!

image

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల్లో ఎక్కువ మంది యువతరమే కావడం విషాదాన్ని నింపుతోంది. ఉపాధి కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. నైపుణ్యం లేకపోయినా ఫార్మా కంపెనీలోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతో యువకులు ఫార్మా పరిశ్రమలో చేరుతున్నారు. చనిపోయిన వారిలో ఆరుగురు 30 ఏళ్ల లోపు, మరో ఆరుగురు 40 ఏళ్ల లోపు వాళ్లు కాగా.. వీరిలో కొందరికి ఇంకా వివాహం కాలేదు.

News August 22, 2024

మంగళగిరి: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 21 మంది అరెస్ట్

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును దర్యాప్తు పోలీసులు వేగవంతం చేస్తున్నామన్నారు. మొత్తం 106 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా 21 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. మిగతా 85 మందికి మంగళగిరి గ్రామీణ పోలీసులు ఈనెల 19 నోటీసులు జారీ చేశారు. ఇందులో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, అరవ సత్యం వంటి ముఖ్య నేతలతో పాటు ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ కూడా ఉన్నారని తెలిపారు.

News August 22, 2024

అనంతపురంలో దులీప్ ట్రోఫీ.. 2న క్రికెటర్ల రాక

image

దులీప్ ట్రోఫీకి అనంతపురం సిద్ధమవుతోంది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మధుసూదన్ తెలిపారు. వచ్చే నెల 2న క్రికెటర్లు నగరానికి చేరుకుంటారని చెప్పారు. మాసినేని, అలెగ్జాండర్ హోటళ్లలో వారు బస చేస్తారని వివరించారు. అనంతపురంలో1962లో ఇరానీ ట్రోఫీ మ్యాచ్ జరగ్గా 62 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లు జరుగుతున్నాయని చెప్పారు.

News August 22, 2024

కర్నూల్ జిల్లాకు రూ.59.60 కోట్లు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు రూ.59.60 కోట్లు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజునాయుడు తెలిపారు. నంద్యాల జిల్లాలోని 488 పంచాయతీలకు రూ.28.05 కోట్లు మంజూరు కాగా, కర్నూలు జిల్లాలోని 482 పంచాయతీలకు రూ.31.56 కోట్లు వచ్చాయని వివరించారు.