India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్ 23 నార్త్ జోన్ క్రికెట్ పోటీల్లో భాగంగా మొదటి రోజు శ్రీకాకుళం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేయగా తదుపరి 274 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు 31.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ కావడంతో మొదటిరోజు విశాఖ జట్టు గెలుపొందింది. బుధవారం విజయనగరం-విశాఖ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ నెల 14న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. SSC, డిప్లమా, ఐటీఐ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 4 కంపెనీల్లో పని చేసేందుకు 818 మందిని ఎంపిక చేస్తారని తెలిపారు. 18- 35 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (UG) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 12 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. నిర్దేశించిన అన్ని కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సుమారు 22,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకోగా.. విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు కేటాయించిన హోటల్‌కు తీసుకువెళ్లారు.

కడప జిల్లాలో 20 ఏళ్లుగా ఒక కలలా ఉన్న కడప ఉక్కు పరిశ్రమ ఈ సారి పూర్తి అవుతుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీకి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం వచ్చింది. అందులోనూ అతను బీజేపీ ఎంపీ కావడం, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఉండటంతో కడప ఉక్కు పరిశ్రమ సాకారమవుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం టెక్కలి సమీపంలో అండర్-23 నార్త్ జోన్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన పోటీలు ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటిరోజు క్రికెట్ పోటీలను ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ డా.వి.వి నాగేశ్వరరావు ప్రారంభించారు. మొదటి రోజు శ్రీకాకుళం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు ఆర్గనైజింగ్ కన్వీనర్ ఎన్. లాల్ బహుదూర్ తెలిపారు.

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు (07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె- తెనాలి (07873), తెనాలి-విజయవాడ (07630) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల (07781) రైళ్లు నడవవని తెలిపారు.

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాగా పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు చెందిన MLAలు బొమ్మిడి నాయకర్, పులపర్తి అంజిబాబు, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు ఉన్నారు

విజయనగరం జిల్లాలో 3,600 మద్యం షాపులు, 40 వేల కుటుంబాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. దత్తిరాజేరు మండలం మానాపురం, మరడాం, రాజుల రామచంద్రపురం, మేడపల్లి, చల్లపేట వైన్‌షాపుల్లో చేస్తున్న సిబ్బంది రోడ్డెక్కారు. కొత్త ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన చెందారు. ఈ సమస్యని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మీడియాని కోరారు.

రేపటి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం నిమిత్తం గన్నవరంలో 12 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరి రాక నిమిత్తం వీఐపీల కాన్వాయ్ వెళ్లే దారిలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వివరాలు వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.