India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉడేగోళానికి చెందిన పదో తరగతి చదువుతున్న చరణ్‌ను రెండు నెలల కిందట రాయదుర్గం మండలం 74 ఉడేగోళం వద్ద ఉన్న హైవేపై రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి చెందిన ఘటన ఒంటిమిట్ట మండలంలోని ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు కోనేటి గంగమ్మ తన ఇంటిలోని ఫ్రిజ్‌ను తెరవగా కరెంట్ షాక్ తగిలి అరుపులు వేసింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న పేరూరు కొండయ్య అరుపులు విని ఇంటిలోకి వెళ్ళి ఆమెను రక్షించబోయే అతడు కరెంట్ షాక్‌కు గురై మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తొమ్మిదికి తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది. మంగళవారం విజయవాడలోని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఒకే ఫ్రేమ్‌లో ఫొటో దిగారు.

ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల ప్రాంగణాల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ తెరలపై వీక్షించే ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ‘లైవ్ స్ట్రీమింగ్’ విధానంలో తెరలపై ప్రదర్శిస్తారు. నియోజకవర్గంలో ఒకచోట ఎక్కువ మంది వీక్షించేలా భారీ తెరలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

ఈనెల 12వ తేదీన సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరు కానున్నందున, గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల మళ్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ మంగళవారం తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు పేరేచర్ల జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా హైదరాబాద్ వెళ్లాలన్నారు. ప్రమాణ స్వీకారం ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందన్నారు.

పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేసేందుకు ఒంగోలు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా మండలాలకు బ్యాగ్లు, పుస్తకాలు, బూట్లు, బెల్ట్ తదితర వస్తువులు సరఫరా చేశారు. అక్కడి నుంచి పాఠశాలలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హెచ్‌ఎంకు రవాణా ఛార్జీలు మంజూరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి స్టూడెంట్ కిట్ పేరుతో పంపిణీ చేపట్టాలని మౌఖిక ఆదేశాలందాయి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తీర్మాన పత్రాన్ని మంగళవారం కూటమి నేతలు గవర్నర్‌కు అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌లు కలిసి విజయవాడలోని రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ దోపిడీకి సంబంధించి 275 కేసులు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, సర్వేపల్లిలోని పొదలకూరు మండలాల్లో భారీ ఎత్తున మైనింగ్ జరిగింది. అక్రమ మైనింగ్ పై అప్పట్లో సత్యాగ్రహం చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రూ.1200 కోట్ల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తవ్వినట్లు గుర్తించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో జిల్లా నుంచి ఐదుగురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. పొంగూరు నారాయణ గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. ఆయనతో పాటు నెలవల విజయశ్రీ(సూళ్లూరుపేట), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి(కోవూరు), కావ్యా కృష్ణారెడ్డి(కావలి), కాకర్ల సురేష్ (ఉదయగిరి) ఉన్నారు.

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రజలు తిలకించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి కోటమిట్ట షాదీమంజిల్, నవాబుపేటలోని బీవీఎస్ ఉన్నత పాఠశాల, స్వతంత్ర పార్కులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కస్తూరిబా కళాక్షేత్రంలోనూ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.