India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున బుధవారం ట్రాఫిక్ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే రవాణా వాహనాలు హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుమూడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్లాలన్నారు.
కేంద్రంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా నియమితులు కావడంతో భోగాపురం మహర్దశ పటనుందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. విశాఖ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2014లో చంద్రబాబు విశాఖ-విజయనగరం మధ్య భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని నిర్ణయించారు. గత సర్కార్ నిర్మాణంలో తీవ్ర జాప్యం చేసింది. ప్రస్తుతం కేంద్ర,రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండటంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి.
అల్లూరి జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతరలో ఆరేళ్ల పాపపై దుండగులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. జాతరకు ఓ కుటుంబం రాగా.. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో పాపను దుండగులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి పరారయ్యారట. పాప ఏడుస్తూ విషయం పెద్దవాళ్లకి చెప్పడంతో పాడేరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున వాహనాలను మళ్లిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లే పాసులు ఉన్న వాహనాలు, అంబులెన్సులు, అత్యవసర ఆరోగ్య చికిత్స ఉన్న వాహనాలనే రేపు ఉదయం రామవరప్పాడు రింగ్ సెంటర్ నుంచి గన్నవరం వైపు అనుమతిస్తామని, ప్రజలు తమకు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు.
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను మంగళవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 188 మందిపై రూ. 44,990 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 17 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో సముద్రం ఒడ్డున మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కందుకూరుకు చెందిన కొత్తూరి వెంకటేశ్వర్లు (45)గా గుర్తించారు. మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. సింగరాయకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీటెక్- మెకానికల్ ఇంజినీరింగ్( 2020- 21 నుంచి అడ్మిషన్ పొందినవారు) కోర్సు సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైంటేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://www.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
పెడన మండలంలో ఇటీవల వెలుగు చూసిన ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో ఇద్దరు VVAలను సస్పెండ్ చేసినట్టు, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జ్యోతి తెలిపారు. ప్రాథమిక విచారణలో మడక, శింగరాయపాలెం వీవీఎల పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు. 152 మంది నకిలీ ఖాతాలకు రూ.40 లక్షలకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీ జమ అయినట్టు విచారణలో తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
జడ్పీ సర్వసభ్య సమావేశం 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించను న్నట్లు సీఈవో జి.నాసర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల శాఖలపై సమీక్షించనున్నట్లు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని యూనియన్ బ్యాంక్ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కిర్లంపూడి నుంచి కాకినాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొనగా.. సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడి వయసు సుమారు 40-45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.