Andhra Pradesh

News March 28, 2024

మెట్టుకూరు మెట్టు దిగేనా !

image

వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాల్లో వైసీపీ సీనియర్ నేత, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయరెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల వెంకటగిరిలో పెద్దసంఖ్యలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పాటు కచ్చితంగా పోటీలో ఉంటానని రాజకీయ కాక రేపారు. ఈ క్రమంలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపురావడంతో వెళ్లారు. కీలక నేతలు సుదీర్ఘంగా మంతనాలు సాగించినా ఆయన మెత్తబడలేదని సమాచారం.

News March 28, 2024

ఉండ్రాజవరంలో భర్తను హత్య చేసిన భార్య

image

ఉండ్రాజవరంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. మద్యం మత్తులో నిత్యం వేధించడంతో భార్య అసహనానికి గురై దాడి చేసినట్లు భార్య తెలిపింది. ఈక్రమంలో జరిగిన పరస్పర దాడులలో భర్త గొల్లవిల్లి వెంకట్, కుమారుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

నరసరావుపేట ఎంపీగా గెలిచేదెవరు.?

image

నరసరావుపేట లోక్‌సభ స్థానంలో MP లావు కృష్ణదేవరాయలు, MLA అనిల్ మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. YCPకి రాజీనామా చేసి టీడీపీ నుంచి బరిలో దిగుతున్న లావు.. పల్నాడు అభివృద్ధి కోసమే గుంటూరు YCP ఎంపీ టికెట్ వద్దనుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు, వైసీపీ పాలనను టీడీపీ ప్రభుత్వంతో బేరీజు వేసుకొని తీర్పు ఇవ్వాలని అనిల్ అంటున్నారు. వీరిద్దరూ నాన్ లోకల్ కాగా, విజయం ఎవరిని వరిస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 28, 2024

కిమిడి పోటీ ఎక్కడ నుంచి..?

image

ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. పొత్తులో భాగంగా ఆయన ఆశించిన ఎచ్చెర్ల సీటును BJPకి కేటాయించారు. విజయనగరం MP అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కూడా ఆయన పేరు లేదు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. చీపురుపల్లిలో నుంచి బరిలో ఉంటారా..లేక ఉమ్మడి విజయనగరంలో TDP ప్రకటించిన 7 స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చి ఆ సీటు కళాకు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

News March 28, 2024

అనంతపురం: పదో తరగతి బాలిక ఆత్మహత్య

image

కడుపు నొప్పి తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉన్న తిరుపాలు, లలిత దంపతుల కుమార్తె సుజనా పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అనంతరం తల్లిదండ్రులు ఆర్డీటీ ఆసుపత్రిలో పనిచేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

News March 28, 2024

నెల్లూరులో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ సినిమా బ్రోచర్ ఆవిష్కరణ

image

నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ సినిమా బ్రోచర్ ను విడుదల చేశారు. ఎస్‌వి‌ఎస్‌ఆర్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం నిర్మాణమవుతుండగా ‘మైండ్ గేమ్’ హీరో శ్రీరామ్ మరోసారి హీరోగా నటిస్తున్నారు. శ్రీకృష్ణ కిషోర్ చిత్రానికి దర్శకుడుగా మిధున ప్రియతో పాటు పలువురు నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, మహేంద్ర, వాసు, శోభన్ బాబు పాల్గొన్నారు.

News March 28, 2024

ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం

image

ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని, గడువులోగా ఆసక్తి గలవారు వివరాలు నమోదు చేసుకోవాలని కురుపాం ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ పట్నాయక్ తెలిపారు. ఈ ఏడాది నుంచి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను అనుమతించడం లేదని ఆన్‌లైన్‌లో తుది గడువులోగా అందజేయాలన్నారు. ఏప్రిల్ 13న పి.కోనవలస, జోగింపేట, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు‌ తెలిపారు.

News March 28, 2024

ఏలూరు జిల్లాలో బీఎస్పీ అభ్యర్థులు జాబితా

image

ఏలూరు జిల్లాలో బీఎస్పీ పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆచార్య ఎన్‌ఏడీ పాల్‌, ఏలూరు అసెంబ్లీకి అందుగుల రతన్‌కాంత్‌, చింతలపూడి- ఎల్‌.చైతన్య, దెందులూరు – నేత రమేశ్‌ బాబు, ఉంగుటూరు- బుంగా ఏసు, కైకలూరు- మన్నేపల్లి నాగేశ్వరరావు, నూజివీడు – డాక్టర్‌ చెలిగంటి వెంకటేశ్వరరావు, పోలవరం – సరయం వెంకటేశ్వరరావులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

News March 28, 2024

జీలుగుమిల్లిలో కూరగాయలు కోసే కత్తితో దాడి

image

మండలంలోని పి.రాజవరంలో బుధవారం రాత్రి పొగాకు రైతు రామ్మోహన్ రెడ్డి పై కూరగాయలు కోసే కత్తితో నాగేంద్ర బాబు అనే వ్యక్తి దాడి చేశారని ఆరోపించారు. పొగాకు ఉడికించే విషయంలో రైతు, కూలీ మధ్య చిన్నపాటి ఘర్షణ దాడికి దారి తీసినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 28, 2024

కిమిడి పోటీ ఎక్కడ నుంచి..?

image

ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. పొత్తులో భాగంగా ఆయన ఆశించిన ఎచ్చెర్ల సీటును BJPకి కేటాయించారు. విజయనగరం MP అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కూడా ఆయన పేరు లేదు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. చీపురుపల్లిలో నుంచి బరిలో ఉంటారా..లేక ఉమ్మడి విజయనగరంలో TDP ప్రకటించిన 7 స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చి ఆ సీటు కళాకు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

error: Content is protected !!