India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు డిగ్రీ 5వ సెమిస్టర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని యూనివర్సిటీ ఉపకులపతి విజయ భాస్కర్ రావు తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ పరీక్షలకు హాజరు కావలసిందిగా ఆయన సూచించారు. అర్ధగంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాలని తెలిపారు.

కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం మండలం సరస్వతిపల్లెకు చెందిన పెంచలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెంచలయ్య గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీలకు తరలిస్తూ ఉంటాడు. అయితే పనిలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి గ్యాస్ సిలిండర్ల లోడుతో లారీలో వెళ్తుండగా.. డోన్ వద్ద ఆగి ఉన్న ఇంకో లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

గత ప్రభుత్వం స్థానిక సంస్థలను అభివృద్ధి చేయకుండా నిర్వీర్యం చేసిందని ఆర్థిక, వాణిజ్య పన్నులు శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 15 ఆర్థిక సంఘం ద్వారా రూ.1,452 కోట్ల నిధులను సీఎం సూచనలు మేరకు విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు, అర్బన్ పరిధిలో రూ.454 కోట్లు విడుదలయ్యాయని అన్నారు.

పాచిపెంట మండలంలో ఇద్దరు గిరిజన యువతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు సమీపంలోని నేలబావిలో దూకి సేబి సంబురమ్మ (24), పోయి లక్మి (18) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి వీరిద్దరూ చేతులకు చున్నీలు కట్టుకొని బావిలో దూకినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయవాదిగా హైకోర్టులో వాదనలు వినిపించేందుకు గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన పతివాడ రామకృష్ణను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో న్యాయవాది రామకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన రామకృష్ణకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్ సాయి(24) అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామానికి చెందిన పిట్ట కామయ్యతో పాటు మరో ఇద్దరిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం విజయవాడ డీసీపీ హరికృష్ణ వివరాలు వెల్లడించారు. కళ్యాణ్ సాయి, నారాయణ, పీ.కామయ్యా, కె.నాగేశ్వరరావు నలుగురూ మద్యం తాగేందుకు వెళ్లగా అక్కడ వాగ్వివాదం జరగడంతో సాయిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

మాజీ సీఎం జగన్‌పై ఉన్న కేసుల విచారణ వేగంగా చేపట్టాలంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వేసిన పిల్‌పై హైకోర్ట్ ఈరోజు విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ జరిగింది. తిరిగి పిటిషన్లపై విచారణను హైకోర్ట్ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు డిగ్రీ 5వ సెమిస్టర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని యూనివర్సిటీ ఉపకులపతి విజయ భాస్కర్ రావు తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ పరీక్షలకు హాజరు కావలసిందిగా ఆయన సూచించారు. అర్ధగంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాలని తెలిపారు.

విశాఖ జడ్పీ భవనంలో ఈనెల 24వ తేదీన ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించనున్నట్లు సీఈవో ఎం.పోలినాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన సమావేశాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.

కొందరు తన పేరిట సందేశాలు పంపిస్తున్నారని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం తెలిపారు. తన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని జిల్లాలోని అధికారులతో పాటు ఇతరులకు సందేశాలు పంపిస్తున్నారని వివరించారు. ఆ ఫోన్ నంబర్ (94785566071) తనది కాదని, వారు పంపే సందేశాలకు రెస్పాండ్ కావద్దని సూచించారు. కాల్స్ కూడా స్వీకరించొద్దంటూ కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.