Andhra Pradesh

News June 10, 2024

సింహగిరిపై అప్పన్నకు దివిటీ సేవ

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మి నరసింహ స్వామి వారికి దివిటీ సేవ నిర్వహించారు. సోమవారం ఒడిశాకు చెందిన భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయంలో ముందుగా టికెట్ తీసుకున్న వారికి దేవస్థానం రెండు దివిటీలను అందజేస్తుంది. ఈ దివిటీలను పట్టుకుంటూ ఆలయం చుట్టు భజనలు చేస్తూ ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ ఆలయంలో ఆధ్యాత్మికతకు నిదర్శనగా నిలుస్తుంది.

News June 10, 2024

రుద్రవరం: వీఆర్‌ఏ ఆకస్మిక మృతి

image

రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామ వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న పీరు బై(47) సోమవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు వీఆర్వో హుస్సేన్ తెలిపారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందారన్నారు. వీఆర్ఏ మృతదేహానికి తహశీల్దార్ మురళిమోహన్ పూలమాలవేసి నివాళులర్పించారు. 

News June 10, 2024

పెండ్లిమర్రి: గుండెపోటుతో వ్యక్తి హఠాన్మరణం

image

గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపెండ్లిమర్రి మండలం యాదవాపురంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఆదిమూలం వెంకట కృష్ణయ్యకు (54) గుండె నొప్పిగా ఉందని కుటుంబీకులు అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మరణించాడని తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయామని ఇంక మాకు దిక్కెవరని కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

News June 10, 2024

కృష్ణా: ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన బీ ఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News June 10, 2024

మాసీ CM జగన్‌ను కలిసిన ప.గో. జిల్లానేతలు

image

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలను ఆయనతో చర్చించారు. కార్యక్రమంలో MLC కౌరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గూడూరి ఉమాబాల, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. 

News June 10, 2024

రామ్మోహన్‌నాయుడుకు పౌరవిమానయాన శాఖ.. భోగాపురానికి మరింత ఊపు..!

image

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడుకు పౌరవిమానయానశాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. ఆశాఖ కేటాయింపుతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్ పోర్టు పనులు మరింత వేగంగా జరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్వక్తంచేస్తున్నారు. 2014 కూటమి ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు CM హోదాలో చంద్రబాబు, కేంద్రమంత్రి హోదాలో అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేయగా.. మళ్లీ సీఎం జగన్ రెండోసారి శంకుస్థాపన చేశారు.

News June 10, 2024

సిక్కోలు నిరుద్యోగుల కల నెరవేరేనా …!

image

VZM జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ఇప్పటికే జరుగుతుండగా .. పక్క జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన ) మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం కేటాయించడంతో ఈ ఎయిర్పోర్ట్ పనులు మరింత ఊపు అందుకోనున్నాయని ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగం కలనెరవేరబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News June 10, 2024

అనంత: రాష్ట్రంలోనే మెుదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఐదేళ్ల కిందట మూతబడగా.. ఎమ్మెల్యే బాలకృష్ణ తొలి అన్న క్యాంటిన్‌ను తన నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. హిందూపురం నుంచి మూడోసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు రుణపడి ఉంటానని బాలయ్య పేర్కొన్నారు.

News June 10, 2024

పాండురంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం

image

వాడరేవు వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం గల్లంతైన కావూరివారిపాలెంకు చెందిన జైపాల్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం బాపట్ల పక్కన ఉండే పాండు రంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని చీరాల రూరల్ పోలీసులకు విషయాన్ని తెలిపారు. జైపాల్‌తో సహా ముగ్గురు వాడరేవులో సముద్ర స్నానానికి వెళ్లగా ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

News June 10, 2024

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లి పండగ

image

ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం గంగమ్మతల్లి పండగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి.. తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.