Andhra Pradesh

News June 10, 2024

కాకినాడ: ACCIDENT.. యువకుడు దుర్మరణం

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని వెంగాయమ్మపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గోకవరం మండలం అరవపేట కాలనీకి చెందిన మండపాటి మణిరత్నం(33) బైక్‌పై జగ్గంపేట నుంచి గోకవరం వెళ్తుండగా వెంగాయమ్మపురం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  

News June 10, 2024

YCP నేతలకు కలిసిరాని విజయవాడ ఎంపీ సీటు

image

వైసీపీ నేతలకు విజయవాడ ఎంపీ సీటు కలిసిరావడం లేదు. 2014లో ఓడిపోయిన కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019లో బరిలో దిగి ఓటమి చవిచూసిన తర్వాత పీవీపీ రాజకీయాలకు దూరం అయ్యారు. ఇదే క్రమంలో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇలా మూడుసార్లు ఓడిపోయిన వారు YCP అభ్యర్థులే కావడం గమనార్హం. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నాని కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.

News June 10, 2024

విశాఖలో APL నూతన లోగో ఆవిష్కరణ

image

మన ఆంధ్ర-మన ఏపీఎల్ నూతన లోగోను విశాఖలో ఆవిష్కరించారు. ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఆరు జట్లు, 11 మ్యాచులు, 120 మంది క్రీడాకారులతో నిర్వహిస్తున్నట్లు ఏపీఎల్ పాలక మండలి సభ్యులు మాంకో ఫెర్రర్, ఛైర్మన్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, కే.ఎస్ భరత్, రికీ భూయా పాల్గొన్నారు.

News June 10, 2024

పార్వతీపురంలో టీచర్ సూసైడ్

image

మానసిక స్థితి సరిగా లేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పార్వతీపురం మండలం చిన్నబొండపల్లిలో చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం బొడ్డవలస పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుడిగా చిట్టా పాపారావు (48) విధులు నిర్వహిస్తున్నారు. అతని మానసికస్థితి సరిగా లేక ఇంట్లో ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 10, 2024

నరసన్నపేట: కేంద్ర పదవితో జిల్లాకు మహర్దశ: బగ్గు

image

చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా మూడు పర్యాయాలు సిక్కోలు ప్రజల మన్ననలతో విజయం సాధించిన రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవితో జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నరసన్నపేటలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన కేంద్రమంత్రి పదవి చేపట్టడంతో జిల్లాకు మహర్దశ వస్తుందని పేర్కొన్నారు.

News June 10, 2024

విశాఖ: పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

సౌత్ ఈస్ట్రన్ రైల్వే చక్రధర్ పూర్ డివిజన్ పరిధిలో భద్రత పరమైన పనులు చేపడుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్టేర్ రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. రూర్కెలా-జగదల్పూర్-రూర్కెలా ఇంటర్ సీటీ రైళ్లను ఈనెల 12వ తేదీన రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే రూర్కెలా-గుణపూర్-రూర్కెలా ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 12న రద్దు చేసినట్లు తెలిపారు.

News June 10, 2024

కాశీలో కన్నుమూసిన వీరఘట్టం మహిళ

image

వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన లింగం సరోజిని(54) కాశీ యాత్రకు వెళ్లి ఆ దేవుని సన్నిదానంలో సోమవారం కన్నుమూశారు. ఈనెల 5న వీరఘట్టంకు చెందిన కొందరు మహిళలతో కాశి యాత్రకు బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి అయోధ్య, ప్రయోగరాజ్ తదితర యాత్రలు ముగించుకుని కాశీలో బస చేసిన హోటల్లో ఆమె మృతి చెందారు. కాశీలోని గంగానది ఒడ్డునే ఆమెకు దహన సంస్కారాలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు వీరఘట్టం నుంచి బయలుదేరి వెళ్లారు.

News June 10, 2024

కడప జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

కడప జిల్లాలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సోమవారం సాయంత్రం వెల్లడించారు. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు కురుస్తున్న వర్షాలకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వర్ష ప్రభావానికి లోతట్టు ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటున్నారు.

News June 10, 2024

ప్రకాశం జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

ప్రకాశం జిల్లాలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సోమవారం సాయంత్రం వెల్లడించింది. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు కురుస్తున్న వర్షాలకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వర్ష ప్రభావానికి లోతట్టు ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటున్నారు.

News June 10, 2024

విశాఖలో ప్రశాంతతను తిరిగి నెలకొల్పుతాం: ఎంపీ శ్రీభరత్

image

విశాఖలో ప్రశాంతతను తిరిగి నెలకొల్పుతామని MP శ్రీభరత్ హామీ ఇచ్చారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన ఆయన.. ముందుగా తన తాత ఎం.వీ.వీ.ఎస్ మూర్తికి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తప్పు చేసిన YCP నాయకులు, కార్యకర్తలపై చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో మొన్నటి ఎన్నికల్లో YCP నాయకులు, కార్యకర్తలు చూశారని అన్నారు.