India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉత్తర్వులను జారీ చేశారు. నర్సీపట్నం టౌన్లో పనిచేస్తున్న త్రిపురాన క్రాంతికుమార్‌ను వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న సీఐ వానపల్లి నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐగా, ఎంవీవీ రమణమూర్తిని విజయనగరానికి, బుచ్చిరాజును అనకాపల్లి పీసీఆర్ సీఐగా, జీ.దుర్గాప్రసాద్‌ను అల్లూరి సోషల్ మీడియా సైబర్ సెల్ సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాయుగుండం ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఉదయం 11:30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది.

తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూర్మన్నపాలెం వద్ద నేడు రాస్తారోకో నిర్వహించనున్నారు. ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని 1306 రోజుల నుంచి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, పూర్తి సామర్థ్యంతో నడపాలని వేతనాలు సక్రమంగా చెల్లించాలని రాస్తారోకో చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 3,710 క్యూసెక్కులగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తివేసి 2,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాల్వల ద్వారా 190 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.5 టీఎంసీలకు కాగా.. ప్రస్తుతం 1.858 టీఎంసీలు ఉందన్నారు.

ఈనెల 11న అండర్ -14 పురుషుల కడప జిల్లా జట్టు ఎంపికలు కడప నగరంలోని వై.ఎస్. రాజారెడ్డి స్టేడియంలోని క్రికెట్ నెట్స్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమతో పాటు ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు సైజ్ ఫొటో,తెచ్చుకోవాలన్నారు.

ఓనం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్ట్యా కాచిగూడ-కొల్లాం-కాచిగూడ రైలును కడప మీదుగా నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాచిగూడ నుంచి 14వ తేదీ సాయంత్రం రైలు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 12.38కు కడపకు కి చేరుకొని రేణిగుంట, కాట్పడి, త్రిశూర్, ఎర్నాకులం మీదుగా కొల్లాం చేరుకుంటుందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ భట్‌ను సెలవుపై వెళ్లాలని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎండీ బాధ్యతలను వెంటనే అదనపు డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా సీఎండీపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తితో ఉండడం వల్లే ఆయనను సెలవు వెళ్లాలని ఆదేశించినట్లు తెలిసింది. సీఎండీగా అతుల్ భట్ 2021 సెప్టెంబర్ 13న బాధ్యతలు స్వీకరించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 115 జీవోను వెంటనే రద్దు చేయాలని మహారాజా ఆసుపత్రి నర్సులు డిమాండ్ చేశారు. ఏపీ నర్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. జీవోను రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేయాలన్నారు. నర్సింగ్ కోర్సులు చదివి ప్రభుత్వాసుపత్రిలో సేవలు చేస్తున్నామని, సచివాలయాల్లో పనిచేస్తున్న ANM లను స్టాఫ్ నర్సులుగా పెట్టడం సరికాదన్నారు.

ఏలూరు జిల్లాలో వర్షాలు, వరదల ప్రభావానికి గురైన ఏడు మండలాల్లోని పాఠశాలలకు మంగళవారం (నేడు) సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎస్.అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలు మండలంలో ఒకటి, పెదపాడులో ఏడు, మండవల్లిలో 18, కైకలూరులో 9, ఏలూరులో 1, ముదినేపల్లిలో 3, కలిదిండి మండలంలో 5 పాఠశాలలకు సెలవు ప్రకటించామన్నారు. మిగతా పాఠశాలలు యథావిధిగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.