India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు రద్దయింది. రైలు నంబర్ (17487) విజయవాడ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద నీరు నిలిచి, రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వలన రైలును నేడు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ప్రకటనలో తెలిపారు. కావున ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతిరోజు టీచర్స్ అటెండెన్స్‌పై దృష్టిపెట్టాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. పుట్లూరు నుంచి 100% అటెండెన్స్ నమోదయిందని, గుమ్మగట్ట నుంచి టీచర్స్ అటెండెన్స్ చాలా తక్కువగా నమోదయిందన్నారు. టీచర్స్ అటెండెన్స్ పెరిగేలా చూడాలన్నారు. మున్సిపల్, మండల పరిధిలో ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టాలని ఆదేశించారు.

రేపు గుంటూరు డి.ఎల్.టి.సి, ఐ.టి.ఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృధి అధికారి ప్రణయ్ సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా, డిగ్రీ లేదా బి.టెక్ ఆపైన చదువుకున్న వారు అర్హులని తెలిపారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు.

పదవులు అనుభవించినవారే YCPకి ద్రోహం చేస్తున్నారని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణం అధికారాన్ని అనుభవించిన కొందరు MLAలు, MPలు, MLCలు, నాయకులు పార్టీ గుండెల్లో పొడిచి పోతున్నారన్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామన్నారు.

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నిర్వహించిన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమంలో మొత్తం 08 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబందించిన శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం.

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు క్యాబినెట్ హోదా దక్కింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇకపై క్యాబినెట్ హోదాలో ఎమ్మెల్సీ బొత్సకు అవసరమైన ప్రొటోకాల్, మర్యాదలు ఇవ్వాలని ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి 132 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ పీ.జగదీశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన, నాణ్యతగా పరిష్కారం చూపాలనే ప్రభుత్వం సంకల్పం మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని శృంగవరంలో డయేరియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 15 మంది రోగులు అతిసారం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే అతిసారం ప్రబలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటింటికి సర్వే చేపట్టి, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు.. వరదల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప.గో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సెలవును అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు.

కృష్ణాజిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. కృష్ణానదికి వరద ఉద్ధృతి తగ్గకపోవటంతో కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులెవరూ పిల్లలను స్కూల్స్‌కు పంపవద్దని డీఈఓ కోరారు.
Sorry, no posts matched your criteria.