India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గూడూరు-వెంకటగిరి రోడ్డుపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి గూడూరు వైపు వస్తున్న కారు.. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పుత్తూరు ప్రజాగళం సభలో చంద్రబాబు(CBN) కీలక ప్రకటన చేశారు. ‘నగరి ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నా జబర్దస్త్ రోజా ఏం చేయలేదు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారు. గతంలో పవర్‌లూమ్ చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలో సబ్సీడీ ఇచ్చి ఆదుకుంది మేమే. ఈసారి గెలిచిన వెంటనే 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం. నేటం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులకు బకాయిలు చెల్లిస్తాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి బుధవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములను తెరిపించి, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన బ్లాకులను, ఈవీఎంలను పరిశీలించారు.
చంద్రబాబు కుప్పం పర్యటనపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్పందించారు. ‘భయం అంటే ఏంటో తెలుసా? చంద్రబాబు కుప్పంలో ఒక్కరోజూ ప్రచారం చేయకుండా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతున్నాడు. కారణం కుప్పంలో జగన్ గారు చేసిన అభివృద్ధి. కుప్పం ప్రజలు ఈసారి వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు అనే నిజానికి చంద్రబాబు భయపడ్డాడు’ అని ఆయన ట్వీట్ చేశారు.
గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని చిలకా చిన్నారి (15) మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. క్రోసూరు మండలం నాగవరాని చెందిన విద్యార్థిని స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో పది పరీక్షలు రాస్తోంది. బుధవారం సైన్సు పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయింది. విద్యార్థినికి కొన్నాళ్లుగా గుండె సమస్య ఉన్నట్లు సమాచారం.
పలాస మండలం మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40), జమ్మూకశ్మీర్ ఉదంపూర్‌లోని యూనిట్‌లో జేసీఓ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జమ్మూకశ్మీర్ నుంచి ఈ రోజు సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని ఐదు పార్లమెంటు స్థానాలకు BSP అధిష్ఠానం తమ అభ్యర్థులను ప్రకటించింది. అందులో నెల్లూరు MP అభ్యర్థిగా గూడూరుకు చెందిన బీఎస్పీ నాయకుడు భాస్కర్ గౌడ్‌ను, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లికార్జున్‌ను ఎంపిక చేసింది. 50 అసెంబ్లీ స్థానాలకు BSP తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఎర్రగుంట్ల వద్ద రైలు కింద పడి బుధవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని కదిరివారిపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కుటుంబ సమస్యల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శరీరం రెండు ముక్కలుగా విడిపోయింది. మృతుడు పట్టణంలోని మహాత్మా గాంధీ నగర్ వాసిగా పోలీసులు గుర్తించారు.
ఈనెల 31న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసందే. మ్యాచ్‌కు సంబంధించి ఈరోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఓపెన్ అయిన గంటలోపే వెయ్యి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోగా.. మ.12.30కి మొత్తం టికెట్లు అయిపోయాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ధోనీ క్రేజ్ వల్లే టికెట్లు త్వరగా అయిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.
సూళ్లూరుపేట సమీపంలోని గోకులకృష్ణ కాలేజీ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డిపో నుంచి సూళ్లూరుపేటకు వెళ్తూ గోకుల్ కృష్ణ కాలేజీ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎవ్వరికి ప్రాణ నష్టం జరగలేదు.
Sorry, no posts matched your criteria.