Andhra Pradesh

News June 10, 2024

అనంత: రాష్ట్రంలోనే మెుదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఐదేళ్ల కిందట మూతబడగా.. ఎమ్మెల్యే బాలకృష్ణ తొలి అన్న క్యాంటిన్‌ను తన నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. హిందూపురం నుంచి మూడోసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు రుణపడి ఉంటానని బాలయ్య పేర్కొన్నారు.

News June 10, 2024

పాండురంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం

image

వాడరేవు వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం గల్లంతైన కావూరివారిపాలెంకు చెందిన జైపాల్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం బాపట్ల పక్కన ఉండే పాండు రంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని చీరాల రూరల్ పోలీసులకు విషయాన్ని తెలిపారు. జైపాల్‌తో సహా ముగ్గురు వాడరేవులో సముద్ర స్నానానికి వెళ్లగా ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

News June 10, 2024

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లి పండగ

image

ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం గంగమ్మతల్లి పండగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి.. తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News June 10, 2024

కడప: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి

image

సుండుపల్లె మండలంలోని పించా దగ్గర ఉన్న చర్చి ఎదుట సోమవారం రెండు బైకులు అతి వేగంతో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సుండుపల్లె ఎస్సై హుస్సేన్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 10, 2024

కర్నూలు: రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ రాజీనామా

image

మద్దికేర మండల కేంద్రానికి చెందిన రేలంపాడు వెంకటేశ్వర్లు రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్‌గా గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో విధులు నిర్వహించారు. అయితే సోమవారం రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను జల వనరుల శాఖ ప్రధాన కార్యదర్శికి పంపారు.

News June 10, 2024

ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా నరసాపురం MP

image

నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. కాగా ఆయన ఇటీవల ఎన్నికల్లో ఆయనకు 7,07,343 ఓట్లు రాగా.. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

News June 10, 2024

పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయింపు

image

గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయమంత్రిగా ఆయన్ను నియమించారు. సోమవారం పెమ్మసాని చంద్రశేఖ‌ర్‌ దిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

News June 10, 2024

కేశినేని నాని ప్రకటనపై స్పందించిన బుద్దా వెంకన్న

image

కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానే ప్రకటన చేయడంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. నాని రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, ప్రజలే తప్పించారని విమర్శించారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే విజయవాడ ప్రజలు కేశినేని నానిని ఓడించడం మరో ఎత్తు అని అన్నారు. చంద్రబాబుకి, నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News June 10, 2024

‘MLA సాబ్.. ఉండి గడ్డ TDP అడ్డా’

image

రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించడంతో సోమవారం ఉండి మండల టీడీపీ కార్యాలయం నుంచి కూటమి కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘు రామకృష్ణరాజుకు అత్యధిక మెజారిటీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘MLA సాబ్.. ఉండి గడ్డ TDP అడ్డా’ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఉండి జనసేన ఇన్‌ఛార్జి జుత్తుగ నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News June 10, 2024

పెళ్ళకూరు: విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా జారిపడి వ్యక్తి మృతి

image

పెళ్ళకూరు మండలం పాల్చూరు గ్రామంలో విషాదం చోటు చేసకుంది. విద్యుత్‌ తీగలు మరమ్మతులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభం మీద నుంచి జారిపడి ఆనందయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు (55) మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.