India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడలో శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి శనివారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలకు సెలవులు మంజూరు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని చెప్పారు.

పెద్దబంగారునత్తం చెరువులో శుక్రవారం మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. శ్రీదేవికి(48) 2020లో మదనపల్లె వాసితో పెళ్లైంది. మూడేళ్లైనా పిల్లలు లేకపోవడంతో వైద్య చికిత్సతో గర్భం దాల్చి ఈనెల 3న ఆడ,మగకు జన్మనిచ్చింది. బాలింతగా ఉన్న ఆమెకు సపర్యలు చేసేందుకు బంధువులు రాలేదు. దీంతో అనారోగ్యానికి గురై మనస్తాపం చెంది, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేశ్ మండపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని చెప్పారు. https://ganeshutsav.net ద్వారా మండపాల ఏర్పాటుకు అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా చేశామని Xలో పోస్ట్ చేశారు.

అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సెలవు ప్రకటించారు. కచ్చితంగా విద్యాసంస్థలు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. ఎంఈఓ లు విద్యాసంస్థల మీద పర్యవేక్షణ చేయాలని సూచించారు.

గోదావరి ప్రాంతంలోని సముద్ర తీరం కాలుష్యమవడం, విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటతో ‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’గా పిలిచే పులస బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు రావడం లేదని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ రీఛార్జ్ ఇనిస్టిట్యూట్ (సిఫ్రీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు గోదావరి తీరంలో ఒక్క పులస మాత్రమే లభ్యమైంది. ఇక పులస చేపలు రావా అని పలువురు చర్చించుకుంటున్నారు.

రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 32.0 నుంచి 35.0 డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 23.8 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా రెండ్రోజులుగా జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తోంది.

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులు వేటకు వద్దని మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి సూచనలు చేశారు.

నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ వైస్ ఛైర్మన్ తెలుగు సాయిశ్వరుడి హత్య కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితులైన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కటిక చికెన్ బాషాల మధ్య జరిగిన ఫోన్ కాల్ వాయిస్ డేటా లభ్యమైందని, సాక్షుల విచారణను తిరిగి తెరవాలని కోరుతూ మృతుడి కుమార్తె జ్యోతి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పూర్తిస్థాయి వాదనలకు సమయం లేకపోవడంతో కోర్టు విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేసింది.

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన డీఎస్సీపీ కింజరాపు ప్రభాకర్ రావు విశాఖపట్నంలో విధులను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో డీఐజీ ఆదేశాల మేరకు పలువురు డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ ఏఎస్పీలుగా నియమించారు. ఈ క్రమంలో డీఎస్పీగా విశాఖలో విధులు నిర్వహిస్తున్న కింజరాపు ప్రభాకర్ రావు శుక్రవారం ఏఎస్పీగా పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ క్రమంలో నేడు పదవీ విరమణ చేయనున్నడటం విశేషం.

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SHARE IT.
Sorry, no posts matched your criteria.