India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాపూర్ మండలంలోని పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం నాలుగోవ శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం రాత్రి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అధికారుల సమన్వయంతో ప్రత్యేక అధికారులు నిర్వహించవలసి ఉంటుంది. గుంటూరుకు మల్లికార్జున, బాపట్లకు ఎంవి శేషగిరి బాబు, పల్నాడుకు రేఖ రాణిని ప్రభుత్వం నియమించింది.

ఆగష్టు నెల 31న పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతకు నిదర్శనమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. 31న అందుబాటులో లేని లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న పెన్షన్లు అందచేస్తారన్నారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే అందిస్తున్నారని తెలిపారు.

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం, పలాస మీదుగా భువనేశ్వర్ (BBS), బెళగావి(BGM) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం BBS- BGM(నం.02813), సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం BGM- BBS(నం.02814) మధ్య నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మరో 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

నేర సంఘటనలపై కేసు నమోదు చేసినంతనే సరిపోదని.. బాధితులకు న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. స్థానిక మహిళా యూనివర్సిటీ సెమినార్ హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయం కోసం ప్రజలు ఏ సమయంలో వచ్చి ఫిర్యాదు చేసినా స్వీకరించి, సమగ్రంగా విచారణ చేయాలని చెప్పారు. నేరాలపై అలసత్వం పనికిరాదన్నారు. సమాచారం అందిన వెంటనే నేర స్థలాన్ని పరిశీలించాలన్నారు.

వర్షం కారణంగా పత్తికొండ పర్యటన రద్దు కావడంతో సీఎం చంద్రబాబు శనివారం ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్‌తో కలిసి కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం 1.50 గంటలకు సీఎం ఓర్వకల్లు గ్రామానికి చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తారు.

హిందూపురం MLA, హీరో బాలకృష్ణ 50ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడంతో మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘1974లో తెరంగేట్రం చేసిన మామయ్య వేయని పాత్ర లేదు. చేయని ప్రయోగం లేదు. 109 సినిమాలలో నటించి అవార్డులు, రివార్డులతో రికార్డు సృష్టించారు. అగ్ర హీరోగా వెలుగొందుతూనే రాజకీయాల్లో రాణిస్తూ సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్న అన్ స్టాపబుల్ హీరో మా బాల మామయ్య’ అని ట్వీట్ చేశారు.

వెలగపూడిలోని సచివాలయంలో CM చంద్రబాబును కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అధికారులు, పూతలపట్టు MLA మురళీ మోహన్ కలిశారు. స్వామివారి శేషవస్త్రాలతో CMను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను CM చేతుల మీదుగా ఆవిష్కరించి ఆహ్వానించారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి నారాయణ రెడ్డిని, CS నీరభ్ కుమార్‌ను కూడా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.

గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద చిట్టీల పేరిట మోసపోయామంటూ సుమారు 200 మంది బాధితులు ఆందోళన చెపట్టారు. వారి వివరాల ప్రకారం.. వాంబే కాలనీకి చెందిన మరడాన.పరుశురాం చిట్టీలు, రియల్ ఎస్టేట్ పేరిట సుమారు రూ.30 కోట్లతో పరారయ్యడని తెలిపారు. పరుశురాం గాజువాక పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ చేస్తుంటానని నమ్మించి తమను మోసం చేశాడని వాపోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.