Andhra Pradesh

News March 27, 2024

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఇలా

image

ప్రజాగళం పేరుతో మాజీ సీఎం, TDP అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కుప్పం నుండి బయలుదేరి 9:30 గంటలకు పలమనేరు చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. తదుపరి మధ్యాహ్నం 2:30 గంటలకు పుత్తూరుకి, సాయంత్రం 4:30 గంటలకు మదనపల్లె బెంగళూరు బస్ స్టాండు వద్దకు చేరుకుంటారు. విందులో పాల్గొంటారు. అనంతరం ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

News March 27, 2024

ఎచ్చెర్ల : పరీక్ష ఫీజు స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2,4 సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థుల పబ్లిక్ పరీక్షలకు ఫీజు స్వీకరణ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ డీన్ ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీలోగా ఫీజు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 15లోగా చెల్లించవచ్చని కోరారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామన్నారు.

News March 27, 2024

VZM: నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు సీఈవో కె.రాజ్ కుమార్ తెలిపారు. విజయనగరంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు. సభ్యులు అడిగిన సమాచారం సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

News March 27, 2024

విశాఖ: ఏప్రిల్ 1 నుంచి 24 గంటలు విమాన రాకపోకలు

image

విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 24 గంటలు విమాన రాకపోకలకు నేవీ అనుమతించింది. రీ సర్ఫేసింగ్ పనులు కారణంగా 2023, నవంబర్ 15 నుంచి రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకూ రన్ వే మూసి మూసి వేస్తూ పనులు చేపట్టారు. నిర్దేశిత గడువుకు ముందే నేవీ ముందుగానే పనులు పూర్తి చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటంకం తొలగింది.

News March 27, 2024

VZM: గుండె పోటుతో టీచర్ మృతి

image

విజయనగరం ఉడా కాలనీలో గుండెపోటుకు గురై ఉపాధ్యాయుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కే.వెంకటరమణ అనే ఫిజిక్స్ టీచర్ మంగళవారం విజయనగరం బాలికల పాఠశాలకు పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌కి వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుబుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

News March 27, 2024

కమలాపురం నియోజకవర్గంలో TDPకి షాక్

image

కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కమలాపురం మండలంలోని పెద్దచెప్పలిలో మంగళవారం సాయంత్రం ఆయన తన అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.

News March 27, 2024

కృష్ణా: వైసీపీలో చేరిన జనసేన కీలక నేత

image

ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన కీలక నేత బత్తిన రాము మంగళవారం వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈయన బత్తిన ట్రాన్స్‌ఫోర్ట్ అధినేత. గతంలో ఈయన ప్రజారాజ్యం తరఫున గన్నవరం నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ‌చేసి ఓటమి చెందారు. నిన్న ఆయన కేశినేని నానితో సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు.

News March 27, 2024

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా ధర్మవరం సుబ్బారెడ్డి

image

డోన్ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన ధర్మవరం సుబ్బారెడ్డికి అధిష్ఠానం కీలక పదవి అప్పగించింది. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డోన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం ధర్మవరం సుబ్బారెడ్డి ఎంతో కృషి చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలను చేపట్టి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉన్న సుబ్బారెడ్డికి పార్టీ ఈ బాధ్యతలు అప్పజెప్పింది.

News March 27, 2024

15 మంది వాలంటీర్లు.. ముగ్గురు మున్సిపల్‌ సిబ్బంది తొలగింపు

image

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన 15 మంది వాలంటీర్లు, ముగ్గురు మున్సిపల్‌ సిబ్బందిని తొలగిస్తూ కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. వారిలో బొమ్మనహాళ్‌ మండలం డి.హోన్నూరుకు చెందిన వాలంటీర్లు, తాడిపత్రి పురపాలికకు చెందిన ఒప్పంద ఉద్యోగులు రామరాజు, వెంకటరమణ, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకు 36 మంది వాలంటీర్లు, ఐదుగురు రేషన్‌డీలర్లు, ఏడుగురు ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్‌ ఉద్యోగిని తొలగించారు.

News March 27, 2024

విశాఖ: కారుతో యువతి బీభత్సం..!

image

విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కారుతో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మితిమీరన వేగంతో కారు నడిపి మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా.. స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. డ్రైవింగ్ చేస్తున్న యువతి బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థినిగా గుర్తించారు. కారులో ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావడంతో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. కారు నడిపిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు.

error: Content is protected !!