Andhra Pradesh

News March 27, 2024

గుంటూరు: నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇ‌న్‌ఛార్జ్‌ల నియామకం

image

గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌లను వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను నియమించింది. సత్తెనపల్లి, చిలకలూరిపేట, వేమూరులకు మోదుగుల వేణుగోపాల్‌ను.. రేపల్లెకు ఎలక్షన్ అబ్జర్వర్‌గా గాదె మధుసూదన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

News March 27, 2024

చిత్తూరు: 14 మంది వాలంటీర్లు రాజీనామా

image

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కంబార్లపల్లి పంచాయతీ పరిధిలోని 14 మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీవోకు రాజీనామా పత్రాలు సమర్పించారు. తాము రానున్న ఎన్నికల్లో వైసీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటే గౌడ విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. సీఎం జగన్ చొరవతో లబ్ధిదారులకు గత ఐదేళ్లుగా సేవలు అందించామని తెలిపారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు.

News March 27, 2024

భ‌క్తుల‌కు అందుబాటులో పంచాంగం

image

శ్రీక్రోధినామ సంవత్సర పంచాంగాన్ని మంగ‌ళ‌వారం నుంచి టీటీడీ భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచింది. ఏటా లాగానే నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని టీటీడీ ముద్రించింది. తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో త్వ‌ర‌లో టీటీడీ అందుబాటులోనికి తీసుకు రానుంది.

News March 27, 2024

సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి: SFI

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హర్ష కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రామచంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి 90 రోజుల తరువాతే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరేంద్ర, చరణ్ తదితరులు ఉన్నారు.

News March 27, 2024

ఎన్నికలపై శ్రీ సత్యసాయి కలెక్టర్ సమీక్ష

image

ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారులతో పాటు సెక్టార్ అధికారులతో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్యలు పాల్గొన్నారు.

News March 27, 2024

తాగునీటి కొరత లేకుండా పటిష్ఠ చర్యలు: శ్రీకాకుళం కలెక్టర్

image

వేసవి కాలం నేపధ్యంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి ఎద్దడిని అధిగమించేందుకు చేపడుతున్న పనులపై ఆరా తీశారు. తాగునీటికి ఎటువంటి లోటు రాకుండా చూడాలన్నారు. 

News March 27, 2024

ప్రకాశం: పొగాకు గరిష్ట ధర రూ.231

image

ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద ఒంగోలు-1వ పాగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం అమ్మకాలకు కొణిజేడు నుంచి 889 వేళ్లు రాగా 716 వేళ్లు అమ్ముడయ్యాయని సూపరింటెండెంట్ రవికాంత్ తెలిపారు. గరిష్ట ధర కేజీ రూ.231, కనిష్ట ధర రూ.220 పలికిందన్నారు. సరాసరి ధర రూ.228.13 వచ్చినట్లు చెప్పారు. కొనుగోలులో 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News March 27, 2024

కడప: ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

image

ఎన్నికల ప్రచార కార్యకలాపాలు చేపట్టాలనుకున్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.

News March 27, 2024

ప్రచురణకర్తలు నుంచి ధ్రువీకరణ పత్రం: కర్నూలు కలెక్టర్

image

ఎన్నికల పాంప్లెట్ల ముద్రణ, ప్రచారం నిమిత్తం ముద్రించబోయి ఏ పేపర్లు అయినా ప్రచురణకర్తలు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం అందజేయాలని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. ప్రచురణకర్తతో తెలిసిన మరో ఇద్దరితో ధృవీకరణ పత్రం ప్రింటర్లకు ఇవ్వాలన్నారు. ప్రింటర్ కూడా ప్రచురణ కర్త ఇచ్చిన ధృవీకరణ పత్రం, ముద్రించిన దాఖలు నమూనా కాగితాలు 4 కాపీలు 3 రోజులలోగా కలెక్టరు కార్యాలయంలో అందజేయలన్నారు.

News March 27, 2024

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా సమగ్ర ప్రణాళిక: కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగునీటి అవసరాల కొరకు ఏప్రిల్ 8వ తేదీన సాగర్ నీరు విడుదల కానుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. విడుదలయ్యే నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు.

error: Content is protected !!