Andhra Pradesh

News December 16, 2025

AMCల ద్వారా రూ.80 లక్షల ఆదాయం

image

జిల్లా మార్కెటింగ్ శాఖకు AMC ల ద్వారా నవంబరులో రూ.80.03లక్షల ఆదాయం వచ్చినట్లు AD పరమేశ్వరన్ తెలిపారు. పలమనేరు AMC లో రూ.50.58 లక్షలు, చిత్తూరుకు రూ.11.37 లక్షలు, పుంగనూరుకు రూ.7.34 లక్షలు, బంగారుపాళ్యంకు రూ.2.35 లక్షలు, నగరికి రూ.2.16 లక్షలు, కుప్పంకు రూ.4.13 లక్షలు, పెనుమూరుకు రూ.74 వేలు, రొంపిచె ర్లకు రూ.69వేలు, SR పురం రూ.36వేలు, అత్యల్పంగా సోమల AMC ద్వారా రూ.31వేలు వచ్చినట్లు PD తెలిపారు.

News December 16, 2025

విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

image

విశాఖలో మంత్రి లోకేశ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన తనకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సతీశ్వరరెడ్డి కోరారు. కోనసీమ, పోలవరంలో గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలనీ కోరారు.

News December 16, 2025

విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

image

విజయవాడ ఆర్టీసీ మార్కెటింగ్ విభాగం నుంచి పదోన్నతి పొందిన మాధవీలత.. విజయనగరం రీజినల్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్‌లో ఉన్న బస్సుల కొరత, ప్రయాణికుల ఇబ్బందులు, కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.

News December 16, 2025

క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1 పోస్ట్.. కడపలో ఇంటి స్థలం

image

ఆర్టీపీపీకి చెందిన ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం రూ. 2.50కోట్ల నగదు, పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆమెకు గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News December 16, 2025

పది పరీక్షల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి: DEO

image

గుంటూరు జిల్లాను రానున్న 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని PPD, SJR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్స్‌ని మంగళవారం DEO పరిశీలించారు. 10వ తరగతి స్లిప్ టెస్ట్ పరీక్షా పత్రాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళికలు అమలవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ ఖుద్దూస్ ఉన్నారు.

News December 16, 2025

మచిలీపట్నం: ‘అటల్-మోదీ’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే.!

image

నేడు మచిలీపట్నం రానున్న ‘అటల్-మోదీ’ సుపరిపాలన బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మూడు స్థంభాల సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చల్లరాస్తా సెంటర్, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్, డీ మార్ట్ రోడ్డు మీదుగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్‌కు చేరుకుంటుంది. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

News December 16, 2025

నెల్లూరు జిల్లాకు జోన్-4 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో నెల్లూరు జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.

News December 16, 2025

కడప జిల్లాకు జోన్-5 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో కడప జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.

News December 16, 2025

ప్రకాశం జిల్లాకు జోన్-4 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో ప్రకాశం జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.

News December 16, 2025

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా అడ్డాగా మారుతోందా.?

image

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా వేదికగా మారుతోందా.? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జూద క్రీడలు రోజు రోజుకు విస్తరిస్తుండటంమే దీనికి నిదర్శనం. పేకాట వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ జూద శిబిరాలపై, యాంటీ డ్రగ్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.