Andhra Pradesh

News August 23, 2024

‘సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పనులను వేగవంతం చేస్తాం’

image

మెంటాడ మండలం చిన్నమేడపల్లి, దత్తి రాజేరు మండలం మర్రివలస గ్రామాల వద్ద నిర్మించనున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన మౌలిక వసతులను వేగవంతం చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సౌరవ్ గౌర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ట్రైబల్ యూనివర్సిటీ పనులను సమీక్షించారు. వచ్చే మార్చినాటికి అకడమిక్ బ్లాక్స్, హాస్టల్స్ ప్రారంభం కావాలన్నారు.

News August 23, 2024

జవాబుదారీ తనానికి గ్రామాలే నిదర్శనం: తూ.గో కలెక్టర్

image

గ్రామ సభలను విజయవంతం చేసేందుకు ప్రజలను, ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తూ.గో కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి గ్రామసభల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో సభలను నిర్వహించాలని, ఇందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.

News August 23, 2024

నేటి గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభించనున్న గ్రామ సభలను, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తమిమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న గ్రామసభల సంసిద్ధతపై కలెక్టర్‌ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నేటి గ్రామ సభలలో మండలాధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

News August 23, 2024

ఇసుక స్టాక్ యార్డులోకి ఆ వాహనాలకే అనుమతి: కలెక్టర్

image

తుళ్లూరు మండలంలోని తాళాయపాలెం, లింగాయపాలెం ఇసుక స్టాక్ పాయింట్లను గురువారం కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో స్టాక్ పాయింట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే స్టాక్ యార్డులోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

News August 23, 2024

మాజీ సీఎం జగన్‌ను కలిసిన వైసీపీ లీగల్‌సెల్‌ టీం

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను వైసీపీ విజయవాడ లీగల్‌సెల్‌ న్యాయవాదులు గవాస్కర్, ఆదాం గురువారం కలిశారు. జగన్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు జగన్‌ను కలిసి ఎన్టీఆర్‌ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులపై దృష్టి సారించాలని జగన్‌ వారికి సూచించినట్లు సమాచారం.

News August 22, 2024

వైసీపీ ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

image

వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా పలువురిని ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శి(అనుబంధ విభాగాలు)గా నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధికారిక Xలో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో పార్టీలోని పలు పదవులను జగన్ భర్తీ చేశారు.

News August 22, 2024

జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించండి: డీఈఓ

image

జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం డీఈఓ కార్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేజీబీవీ జీసీడీఓ స్నేహలత, అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యూల్ పాల్, జిల్లా సైన్స్ అధికారిణి రంగమ్మ పాల్గొన్నారు.

News August 22, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

* తిరువూరు: చిరంజీవి మూవీ చూసిన ఎమ్మెల్యే కొలకపూడి
* కంకిపాడుకు CM చంద్రబాబు రాక
* విజయవాడ: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
* విష ప్రచారం చేస్తున్నారు: ఎంపీ మిథున్ రెడ్డి
* విజయవాడ: బాలికతో ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన
* విజయవాడ: పార్ట్ టైం జాబ్ పేరిట భారీ మోసం

News August 22, 2024

చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి

image

రాష్ట్రంలో వైసీపీకి సంబంధించి పలు పదవులను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భర్తీ చేశారు. గుంటూరు జిల్లా నుంచి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని నియమించగా.. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. ఈ సందర్భంగా జగన్ వారికి పలు సూచనలు చేస్తూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News August 22, 2024

నంద్యాల: ఉల్లిగడ్డల లారీ బోల్తా

image

పాణ్యం మండలంలోని తమ్మరాజు పల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉల్లిగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఉల్లిగడ్డల బస్తాలన్నీ చెల్లాచెదురయ్యాయి. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.