Andhra Pradesh

News March 26, 2024

సింహాచలం అప్పన్న హుండీ ఆదాయం రూ.1.29కోట్లు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీల ద్వారా ఆదాయం రూ.1,29,30,598 లభించింది. మంగళవారం ఆలయంలో హుండీలను తెరిచి లెక్కించారు. 89 గ్రాముల బంగారం, 9 కిలోల 350 గ్రాములు వెండి లభించింది. అలాగే వివిధ దేశాల కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేశారు. సింహాద్రి అప్పన్న ఆలయానికి అనుబంధంగా గల పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం రూ.8,10,455 లభించింది.

News March 26, 2024

రుద్రవరం: వడ దెబ్బతో 18 నెలల చిన్నారి మృతి

image

రుద్రవరం మండల కేంద్రంలోని బ్రహ్మయ్య ఆచారి, రాజేశ్వరి దంపతుల కుమారుడు లక్ష్మీ నరసయ్య ఆచారి 18 నెలలు వడదెబ్బ సోకి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సోమవారం అహోబిలంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు వెళ్లి తలనీలాలు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం చూస్తే చిన్నారి కదలక పోవడంతో స్థానిక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లగా వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు.

News March 26, 2024

మైదుకూరు: పేలిన లారీ టైరు.. తప్పిన పెను ప్రమాదం

image

నెల్లూరు నుంచి మైదుకూరు వైపు వెళుతున్న లోడు లారీ మంగళవారం బద్వేల్ పట్టణంలోని శేఖర్ థియేటర్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ముందువైపు టైర్ పగలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. లారీ నెమ్మదిగా రావడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

News March 26, 2024

వైసీపీలో చేరిన గంటా నరహరి

image

జనసేన నేత గంటా నరహరి వైసీపీలో చేరారు. గతంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా పని చేసిన ఆయన ఈనెల 13న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నరహరితో చర్చించారు. ఇవాళ CM క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో YCP తీర్థం పుచ్చుకున్నారు.

News March 26, 2024

దర్శి: వీఆర్వో మృతి

image

దర్శి మండలం తూర్పువీరయ్యపాలెం వీఆర్వోగా పనిచేస్తున్న దేసు జయప్రకాష్ (48) మంగళవారం మృతి చెందారు. గత పది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వీఆర్వో సంఘం నాయకులు, దర్శి మండలం వీఆర్వో ఉద్యోగులు సంతాపం తెలిపారు.

News March 26, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నరసాపురం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే ఎనిమిది రైళ్లు ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే – నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయా తేదీలలో మచిలీపట్నం, నరసాపురం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి.

News March 26, 2024

శ్రీకాకుళం: RBKల ద్వారా ధాన్యాన్ని విక్రయించండి

image

ఖరిఫ్ 2023-24 సీజన్ ముగింపు దశ కారణంగా ఈ నెలాఖరులోగా రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన RBKల ద్వారా ప్రభుత్వానికి విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నవీన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాని రైతు భరోసా కేంద్రాల వద్ద మద్దతు ధరకు విక్రయించాలన్నారు. మార్చి 31 దాటితే రైతులు వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరగదన్నారు.

News March 26, 2024

పదోతరగతి పరీక్షలకు 816 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవశాస్త్రం పరీక్షలకు మొత్తం 25,287 విద్యార్థులు మంగళవారం హాజరయ్యారు. కాగా 816 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి పిర్యాదులు ఎక్కడ అందలేదన్నారు. జిల్లా మొత్తం జీవశాస్త్రం పరీక్ష సజావుగా జరిగిందన్నారు. జిల్లా మొత్తం హాజరు 96.87 శాతం నమోదు అయ్యిందన్నారు.

News March 26, 2024

రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా నాంబత్తుల రాజు

image

రాజమండ్రి రూరల్ జై భీమ్‌రావ్ భారత్ పార్టీ MLA అభ్యర్థిగా నాంబత్తుల రాజుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ నియమించినట్లు తెలిపారు. సామాన్యుడికి MLA టికెట్ రావడం పట్ల పలువురు సామాజిక వ్యక్తులు, ఉద్యమ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచి తీరతానని అన్నారు.

News March 26, 2024

ప.గో.: దివ్యాంగురాలిని నమ్మించి గర్భవతిని చేసి

image

ప.గో. జిల్లా పాలకోడేరు మండలకేంద్రానికి చెందిన పి.దుర్గా సూర్యనారాయణ రాజు అదే గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలిని (యువతి) నమ్మించి గర్భవతిని చేశాడు.  పెళ్లి చేసుకోమని అతడిని కోరగా అతను నిరాకరించినట్లు దివ్యాంగురాలి తల్లి పార్వతి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా..సదరు వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. 

error: Content is protected !!