India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

SPS నెల్లూరు జిల్లాలోని సంతపేట, కోవూరు పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్.పి. జి.కృష్ణకాంత్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను, పోలీసు స్టేషన్స్ మ్యాప్, చార్ట్ లను, స్టేషన్స్ పరిధిలో ఉన్న హైవే, నేర, శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించారు.
మహిళా సంబంధిత సమస్యలపై సత్వరమే స్పందించి, పరిష్కరించాలని ఆదేశించారు.

కృష్ణా: సీఎం చంద్రబాబు అమరావతిలో నీతిఆయోగ్ ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత ఏపీ-2047 డాక్యుమెంట్ రూపకల్పనపై సీఎం ఈ సమావేశంలో నీతిఆయోగ్ బృందంతో చర్చించారు. 12 అంశాలతో వికసిత ఏపీ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, 2047నాటికి ఏపీని 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో వెల్లడించారు.

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 30న వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామంలో 200 మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను 1వ తేదీనే 100 శాతం అందించేలా చర్యలు తీసుకోవాలని, కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. వితంతువులు, వృద్ధులు, కిడ్నీ బాధితులు పెన్షన్ అందుకునే ప్రతి లబ్ధిదారునికి, ఒకటవ తేదీన అందించేలా చూడాలని అధికారులకు సూచించారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 2వ తేదీన పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ టెలి కాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు. సెప్టెంబరు 2వ తేదీన అంతా కలిసి ‘క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర’ కాన్సెప్ట్ తో కార్యక్రమాలను ఊరువాడా ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

తక్కువ నీటి వనరులతో వ్యవసాయం చేయుటకు తుంపర సేద్య పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ITDA పరిధిలో గల గిరిజన సబ్ ప్లాన్ మండలాలలో తుంపర సేద్య రైతులకు 2024-25 సంవత్సరానికి గాను రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ITDA పరిధిలో 750 మందికి గాను రూ.53.79 లక్షలు నిధులు విడుదల చేశామన్నారు.

త్వరలోజరగనున్న గ్రామ రెవెన్యూ సదస్సులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌తో కలసి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్డీవోలు, తహశీల్దార్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి సిబ్బందితో సమీక్షించారు. ప్రతి గ్రామంలోను సభలు నిర్వహించాలన్నారు.

పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు.

2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఖలీల్ అహ్మద్‌కు గుండెపోటు వచ్చింది. అతనిని హుటాహుటిన నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఖలీల్ కు వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఖలీల్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రాష్ట్రంలో 28వ తేదీ బుధవారం నాటికి 56 నిల్వ కేంద్రాలలో 16,65,586 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 35,523 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం 2,739 దరఖాస్తులు గనుల శాఖకు అందాయన్నారు. వీరిలో 2,545 మంది దరఖాస్తు దారులకు 33,181 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను అందించామని మీనా మీడియాకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.