India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని జై రాజ్ స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఎవరికీ గాయాలు కూడా అవ్వలేదని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాల ప్యానల్స్ మాత్రమే కాలిపోయాయని సంస్థ ప్రతినిధి శ్రీనివాస కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

విశాఖ KGHలో క్షతగాత్రులు, చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత అచ్యుతాపురం సెజ్‌కు బయల్దేరారు. ఇదే సమయంలో వర్షం మొదలైంది. వానలోనే సీఎం ప్రమాదం జరిగిన ఎసెన్సియల్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చంద్రబాబుకు వివరించారు.

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామంలో బంకు నిర్వహిస్తున్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసులు లాకెళ్లిన ఇద్దరు నిందితులను 48 గంటల్లో సంగం సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయంలో డి.ఎస్.పి K.వేణుగోపాల్ సమావేశం నిర్వహించి కేసు వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వేమారెడ్డి, ఎస్ఐ ప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బాధిత విద్యార్థులు KGHలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం సెజ్ మృతుల బంధువులతో మార్చురీ వద్ద మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు విద్యార్థుల వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల్లోని రసాయనిక పరిశ్రమల్లో 2019 నుంచి 2024 ఆగస్టు వరకు ఎన్నో ప్రమాదాలు, పేలుళ్లు జరిగాయి. అచ్యుతాపురంలో తాజాగా జరిగిన ప్రమాదంలో సుమారు 17 మంది మృతిచెందారు. అంతకుముందు అనేక పరిశ్రమల్లో మరో 43 మందికి పైగా మృతిచెందారు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

విజయనగరం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2024కు ఈనెల 28వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని DEO ఎన్.ప్రేమ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ డైట్ ఇతర యాజమాన్యాల కింద పనిచేస్తున్న 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులంతా ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు.

YS జగన్ లొసుగులు ఉన్న కంపెనీలను బెదిరించి కమీషన్ దండుకున్నాడని దర్శి TDP ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ‘X’ వేదికగా ఆరోపించారు. ‘ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్‌ను థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయిస్తా అని చెప్పిన దాన్ని కూడా సరిగ్గా చేయించలేదు. ఏ కంపెనీల్లో సేఫ్టీ లొసుగులు ఉన్నాయో ఆ కంపెనీల నుంచి కమీషన్లు దండుకున్నాడు. అందుకే ఎల్జీ పాలిమర్స్ తర్వాత కూడా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి’అని పోస్ట్ చేశారు.

కడప జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ తీగలు, స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయని అనిపిస్తే వెంటనే వీడియో కానీ, ఫొటో తీసి 9440814264 నంబర్‌కు వాట్సప్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని విద్యుత్ ఎస్సీ రమణ తెలిపారు. విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక బృందం ద్వారా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా వాట్సప్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో అవగాహన కల్పిస్తున్నామన్నారు.

విజయవాడలో జరిగిన రోడ్డుప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలోని సమతానగర్‌కు చెందిన కానిస్టేబుల్ తారక రామారావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహానికి గురువారం అధికారిక లాంఛనాలతో గ్రేహౌండ్స్ పోలీసులు అంతిమ వీడ్కోలు పలికారు. తారక రామారావు మృతి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తీరని లోటని పలువురు పేర్కొన్నారు.

అచ్యుతాపురం ఘటన బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకున్నారు. స్థానిక ఎయిర్‌పోర్టులో ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఆయన రోడ్డు మార్గాన మెడికోవర్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ క్షతగాత్రులకు భరోసా కల్పించి నష్టపరిహారంపై స్పష్టమైన ప్రకటన ఇస్తారని సమాచారం.
Sorry, no posts matched your criteria.