Andhra Pradesh

News August 25, 2024

VZM: యువకుడు అనుమానాస్పద మృతి

image

కొత్తవలస మండలం కంటకాపల్లి కొత్తూరుకు చెందిన దుక్క రాధాకృష్ణ(18) కంటకాపల్లి జీడీ పిక్కల ఫ్యాక్టరీ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాధాకృష్ణ ఈనెల 9 నుంచి కనిపించట్లేదని తల్లిదండ్రులు తెలిపారు. బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులకు మృతదేహం కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్.ఐ షణ్ముఖరావు సమక్షంలో పోలీసులు విచారణ చేయగా రాధాకృష్ణ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 25, 2024

ప్రకాశం జిల్లాలో రేపు ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

image

మీ కోసం (ప్రజా ఫిర్యాదుల దినం)ను సోమవారం రద్దు చేసినట్లు కార్యక్రమ జిల్లా సూపరింటెండెంట్ డి నాగజ్యోతి తెలిపారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అర్జీలతో ఎవ్వరూ ఒంగోలు రావద్దని ఆమె కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన మీకోసం రద్దు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.

News August 25, 2024

బొబ్బిలిలో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి

image

బొబ్బిలి మండలంలోని దిబ్బగుడ్డివలస ఎల్సీ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెచ్సీ బి.ఈశ్వరరావు తెలిపారు. మృతుడికి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

News August 25, 2024

విశాఖ: ఎసెన్షియాలో భారీగా సాల్వెంట్ నిల్వలు

image

అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీ రియాక్టర్లలో ఇంకా 700 లీటర్ల సాల్వెంట్ నిల్వలు ఉన్నట్లు తనిఖీలు నిర్వహించిన అధికారులు గుర్తించారు. వాటిని నిపుణుల పర్యవేక్షణలో జాగ్రత్తగా బయటకు పంపించాలని వారు కంపెనీ యాజమాన్యానికి సూచించారు. ప్రమాదాల నివారణ కు మూడు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలని సలహా ఇచ్చారు. కంపెనీ విధిగా సేఫ్టీ ఆడిట్ నిర్వహించి లోపాలను సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు.

News August 25, 2024

శ్రీకాకుళం: ‘నకిలీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

నకిలీ అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖ సహాయ సంచాలకులు రాణి మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తదనుగుణంగా వ్యాపారులకు సమాచారం అందజేస్తున్నామని తెలిపారు. ఇటీవల కొందరు నకిలీ వ్యక్తులు జీఎస్టీ అధికారులంటూ చెబుతూ సంబంధిత సంస్థల్లోకి చొరబడుతున్నారని, ఎవ్వరైనా జీఎస్టీ అధికారులమని వస్తే ఐడీ చూపించాలని అడగాలన్నారు.

News August 25, 2024

ఏలూరు జిల్లాలో YSR విగ్రహం ధ్వంసం

image

ఏలూరు జిల్లాలో YSR విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. జంగారెడ్డిగూడెం మండలం కృష్ణంపాలెం గ్రామంలో YSR విగ్రహాన్ని శనివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఇవాళ ఉదయాన్నే ఈ ఘటనను గుర్తించారు. ఎంపీటీసీ బిరుదుగట్ల రత్నకుమారి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News August 25, 2024

స్వదేశీ దర్శన్ పథకం కింద బొర్రా ఎంపిక

image

ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు నూతన రూపు సంతరించుకోనున్నాయి. స్వదేశీ దర్శన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో బొర్రా గుహలను ఎంపిక చేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. బొర్రా రైల్వే స్టేషన్ మొదలుకొని లోపలికి వెళ్లే అన్ని ప్రదేశాలను ఆధునీకరిస్తారు. గుహల లోపల విద్యుత్ వెలుగుల ఏర్పాటు, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

News August 25, 2024

కాకినాడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవు రామాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. యానాం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ తాళ్లరేవు వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కోరంగి ఎస్ఐ సత్యనారాయణ వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గాడిమొగ వాసిగా గుర్తించారు.

News August 25, 2024

ఆదిభట్ల నారాయణదాసు మనుమరాలు కన్నుమూత

image

హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణదాసు మనుమరాలు కామేశ్వరమ్మ (88) శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, పట్టణ ప్రముఖులు సంతాపం తెలిపారు. హరికథాగానం అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన నారాయణదాసు వంశీకులు ఇప్పటికి కూడా విజయనగరంలో ఉండటం విశేషం.

News August 25, 2024

శ్రీకాళహస్తి: ఇలాంటి విషయాల్లో జాగ్రత్త..!

image

అతని వయస్సు పాతికేళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు. పెడదారి పట్టి చివరకు చనిపోయాడు. శ్రీకాళహస్తి సీఐ గోపి వివరాల మేరకు.. తెలంగాణ(S) సిద్ధిపేట(D) గజ్వేల్‌‌కు చెందిన శివ(26) పెయింటర్‌. ఆరేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో 2 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమె మందలించగా.. బెదిరించేందుకు పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.