Andhra Pradesh

News June 11, 2024

ప్రకాశం: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

image

అదుపుతప్పి కారు ఫెన్సింగ్ ఢీకొట్టి గుంతలో పడింది. ఈ సంఘటన జాతీయరహదారిపై ఉలవపాడు దక్షిణ బైపాస్ సమీపంలో సోమవారం జరిగింది. ఒంగోలు సుజాతనగర్ చెందిన కామేష్ తన భార్యతో కలసి ఒంగోలు నుంచి కావలి వెళుతున్నారు. ఉలవపాడు వద్దకు వచ్చేసరికి మలుపు వద్ద ఫెన్సింగ్ ఢీకొట్టి గుంతలో పడిపోయింది. ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. వేరే వాహనంలో వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 11, 2024

కడప: టీటీడీ బోర్డు పదవికి మా సీమ బాబు రాజీనామా

image

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు ఆర్ వెంకట సుబ్బారెడ్డి (మాసీమ బాబు) ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకే రాజీనామా చేసిన నేపథ్యంలో పాలకమండలి సభ్యులైన మాసీమ బాబు కూడా రాజీనామా చేశారు.

News June 11, 2024

బండారు శ్రావణి శ్రీకి మంత్రి పదవి ఇవ్వాలి: ఫక్రుద్దీన్ వలి

image

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ జిల్లా మైనార్టీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి కోరారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జనచైతన్య నగర్ కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అప్పుడే శ్రావణికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు

News June 11, 2024

శ్రీకాకుళం: పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

సౌత్ ఈస్టర్న్ రైల్వే చక్రధర్ పూర్ డివిజన్ పరిధిలో భద్రత పరమైన పనులు చేపడుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్టేర్ రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. రూర్కెలా-జగదల్పూర్-రూర్కెలా ఇంటర్ సీటీ రైళ్లను ఈనెల 12వ తేదీన రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే రూర్కెలా-గుణపూర్-రూర్కెలా ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 12న రద్దు చేసినట్లు తెలిపారు.

News June 11, 2024

‘చంద్రబాబు ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి’

image

ఈ నెల 12న గన్నవరం మండలం కేసరపల్లిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ అతిథులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

News June 11, 2024

VJA: పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

భారత ప్రభుత్వ సూచనల మేరకు ఏపీ 2025లో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. కళలు, సాహిత్యం, వైద్యం, క్రీడలు సామజిక సేవా, సైన్స్, ప్రజా సంబంధాలు, సివిల్ సర్వీస్ రంగాలలో విశిష్ట సేవలు అందించినవారు అర్హులని అన్నారు. వీరు https//awards.giv.in పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 11, 2024

అంతర్జాతీయ టోర్నీలో అమలాపురం విద్యార్థుల ప్రతిభ

image

భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నీలో అమలాపురం విద్యార్థులు ప్రతిభ కనపరిచారని అకాడమీ ప్రిన్సిపల్ వెంకట సురేష్ తెలిపారు. ఓపెన్ విభాగంలో కేశనకుర్తి రాజేష్, తాడి సాయివెంకటేష్ చెరో రూ.10 వేలు, ద్రాక్షారపు సాత్విక్ రూ.7 వేల నగదు బహుమతిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు జరిగిన పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి 300 మంది పాల్గొన్నారన్నారు.

News June 11, 2024

బండారు శ్రావణిశ్రీకి మంత్రి పదవి ఇవ్వాలి: ఫక్రుద్దీన్ వలి

image

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని జిల్లా టిడిపి మైనార్టీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి కోరారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జన చైతన్య నగర్ కాలనీ యందు బాబా ఫక్రుద్దీన్ వలి మాట్లాడుతూ.. ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారని.. అప్పుడే  శ్రావణికి మంత్రి పదవి ఇవ్వాలన్నారు.

News June 11, 2024

విశాఖ: పూర్తి స్థాయిలో ఉక్కు ఉత్పత్తి చేపట్టాలని విజ్ఞప్తి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తిని చేపట్టాలని కొత్తగా నియమితులైన ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ అయోధ్య రామ్ విజ్ఞప్తి చేశారు. 7.5 మిలియన్ల ఉత్పత్తి చేపడితే రూ. 50,000 ఆదాయం వస్తుందని తెలిపారు. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 9000 కోట్లు వెళతాయన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు.

News June 11, 2024

జాతీయ స్థాయి సెమినార్‌కు తాళ్లూరు ఏవో ఎంపిక

image

ఇతర దేశాలలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు కావాల్సిన సర్టిఫికెట్ విధివిధానాలను అమలు పరిచేందుకు హైదరాబాదులో జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈసెమినార్‌‌కు తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావును ఎంపిక చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 11 నుంచి 14వరకు జరిగే సెమినార్లో ఏవో పాల్గొనున్నారు. రాష్ట్రం నుంచి తాళ్లూరు ఏవో ఒక్కడే ఎంపిక కావడం గమనార్హం.