India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ, వెండి రథోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. శ్రీస్వామి,అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేసి ఊయలసేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వైభవంగా వెండి రథోత్సవం నిర్వహించారు.

ఈ నెల 12 వ తేది జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఔత్సాహికులైన ప్రజలను నియోజకవర్గానికి నాలుగు బస్సుల ఏర్పాటు చేసి విజయవాడ సభకు తరలించాలని పేర్కొన్నారు. ప్రతి మండల కార్యాలయం, కళ్యాణ మండపాల్లో పండుగ వాతావరణంలో ప్రత్యక్ష ప్రసార వీక్షణకు
ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్‌కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కూటమి బృందం కోరనుంది.

అన్నమయ్య జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను
ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు బాలకార్మికుల నిర్మూలనపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో కనివిందు చేశారు. రూ.50వేలు విలువచేసే నాణేలతో స్వామి మూలవిరాట్‌ని అలంకరించారు. పురోహితుల రామకృష్ణ స్వామి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామి వారి విశేష అలంకరణను దర్శించుటకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్‌కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కూటమి బృందం కోరనుంది.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై ఆయనతో చర్చించారు. కార్యక్రమంలో MLC కౌరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గూడూరి ఉమాబాల, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు విద్యుత్ కాంతులతో దర్శనమిస్తున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులు పాటు అన్ని కార్యాలయాల ఎదుట విద్యుత్ కాంతులతో ఉండాలని సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయంల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీటెక్( 2020- 21 నుంచి అడ్మిషన్ పొందినవారు) కోర్సు ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 13, 14, 15, 18 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు www.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని ధర్మగుండం చెరువు రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22, 23వ తేదీల్లో మహ సహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రవచనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు సోమవారం తెలిపారు. శ్రీ సీతారామ కమ్యూనిటీ హాల్లో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.