Andhra Pradesh

News March 25, 2024

కడప: బీజేపీలో చేరిన టీడీపీ నేత బొజ్జా రోషన్న

image

కడప జిల్లా బద్వేలు టీడీపీ నేత బొజ్జ రోషన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. టీడీపీ తరఫున బద్వేలు ఎమ్మెల్యే సీటును ఆశించడంతో ఆ సీటును కూటమి కుదుపులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో రోషన్న తన అనుచరులతో చర్చించి ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. కడప బీజేపీ కార్యాలయంలో ఆయనకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News March 25, 2024

ఐటీ శిక్షణ ఇప్పిస్తానని.. అఘాయిత్యం

image

కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత హైదరాబాద్ KPHPపరిధిలోని ఓ ఇనిస్టిట్యూట్‌‌లో సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్ శిక్షణలో చేరింది. శిక్షకుడు నరేంద్రకుమార్ ధ్రువపత్రాల తనిఖీ కోసం ఆమెను పిలిచి శారీరకంగా లోబరచుకున్నాడు. విషయాన్నిఆ మహిళ శిక్షణ తరగతుల సహచరుడు కృష్ణా జిల్లా వాసి సంతోష్‌‌కి తెలపడంతో అతను ఆమెను వేధింపసాగాడు. అది తట్టుకోలేక మహిళ నిద్రమాత్రలు మింగింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

News March 25, 2024

కోటవాని చెరువులో యువకుడి డెడ్‌బాడీ

image

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పరిధిలోని కోటవాని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. నిడమర్రు మండలం చిననిండ్రకొలనుకు చెందిన సాయి రమేష్ కొంతకాలంగా ఉంగుటూరు మండలం సీతారాంపురంలో ఉంటున్నారు. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెరువులో మృతదేహం తేలగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.

News March 25, 2024

పాలకొండ: కట్టె జనుము సాగుతో రైతులకు అపార నష్టం

image

కట్టె జనము సాగుతో రైతులకు అపారనష్టం వాటిలిందని పాలకొండ అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు సోమవారం తెలిపారు. సుమారు 50 శాతం మంది రైతులు అపరాల పంటలకు బదులుగా కట్టె జనుము సాగు చేశారని అన్నారు. గొంగళి పురుగు ఆశించడంతో కాయలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. జిల్లా పునర్విభజన అనంతరం రైతులకు సలహాలు సూచనలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల నుంచి దూరమయ్యాయని వాపోయారు.

News March 25, 2024

‘సువిధ’ యాప్‌లో అనుమతులు పొందండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ రకాల పర్మిషన్ల కోసం సువిధ ఆన్‌లైన్ పోర్టర్ ద్వారా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సువిధ ఆన్ లైన్ పోర్టర్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కోసం రిటర్నింగ్ అధికార్లను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

News March 25, 2024

బద్వేలు బీజేపీ అభ్యర్థిగా రోషన్న.?

image

బద్వేలు నియోజకవర్గ కూటమి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొజ్జ రోషన్న ఎంపిక కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, కూటమి సర్దుబాటులో భాగంగా బద్వేలు స్థానం బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రోషన్న నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఈయన పేరు వెలువడనుందని సమాచారం.

News March 25, 2024

సంతనూతలపాడు: ఐదుగురు వాలంటీర్లు రాజీనామా

image

సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జునకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వాలంటీర్లు ఆదివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల కమిషన్ చెప్పడంతో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ రాజీనామాలను ఎంపీడీవోకు అందజేయకుండా నాగార్జునకు అందజేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.

News March 25, 2024

టీడీపీ ప్రమాదంలో చిక్కుకున్న మాట వాస్తవం: మాజీ మంత్రి

image

శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ ప్రమాదంలో చిక్కుకున్న మాట ఎవరు అవునన్నా,  కాదన్నా వాస్తవమేనని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా టీడీపీ ముఖ్య నేతలు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడమే దీనికి కారణమన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఆయనకు సీటు ఇవ్వడం తగదన్నారు.

News March 25, 2024

అందరి చూపు కాటంరెడ్డి వైపే

image

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఇటీవల విష్ణుతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఇవాళ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. విష్ణు మాత్రం పోటీలో ఉంటానంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు.

News March 25, 2024

కుప్పం: టీ చేస్తూ ఎమ్మెల్సీ వినూత్న ప్రచారం

image

కుప్పం నియోజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ శాంతిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ టీ దుకాణంలో టీ చేసి ప్రజలకు అందించి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. భరత్ టీ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా అందుబాటులో ఉండే తనకు రాబోయే ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

error: Content is protected !!