India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం గంగమ్మతల్లి పండగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి.. తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సుండుపల్లె మండలంలోని పించా దగ్గర ఉన్న చర్చి ఎదుట సోమవారం రెండు బైకులు అతి వేగంతో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సుండుపల్లె ఎస్సై హుస్సేన్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్దికేర మండల కేంద్రానికి చెందిన రేలంపాడు వెంకటేశ్వర్లు రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్‌గా గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో విధులు నిర్వహించారు. అయితే సోమవారం రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను జల వనరుల శాఖ ప్రధాన కార్యదర్శికి పంపారు.

నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. కాగా ఆయన ఇటీవల ఎన్నికల్లో ఆయనకు 7,07,343 ఓట్లు రాగా.. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయమంత్రిగా ఆయన్ను నియమించారు. సోమవారం పెమ్మసాని చంద్రశేఖర్ దిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానే ప్రకటన చేయడంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. నాని రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, ప్రజలే తప్పించారని విమర్శించారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే విజయవాడ ప్రజలు కేశినేని నానిని ఓడించడం మరో ఎత్తు అని అన్నారు. చంద్రబాబుకి, నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించడంతో సోమవారం ఉండి మండల టీడీపీ కార్యాలయం నుంచి కూటమి కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘు రామకృష్ణరాజుకు అత్యధిక మెజారిటీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘MLA సాబ్.. ఉండి గడ్డ TDP అడ్డా’ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఉండి జనసేన ఇన్‌ఛార్జి జుత్తుగ నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెళ్ళకూరు మండలం పాల్చూరు గ్రామంలో విషాదం చోటు చేసకుంది. విద్యుత్ తీగలు మరమ్మతులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం మీద నుంచి జారిపడి ఆనందయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు (55) మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలు, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాలలో హెల్త్ సూపర్వైజర్, మేల్ నర్స్, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ కడప జిల్లా కోఆర్డినేటర్ ఎల్. మాధవిలత తెలిపారు. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ సర్టిఫికెట్ ఉన్నవారు ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఎమ్మెల్యే బెందాళం అశోక్ భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికలో గెలుపొంది మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ 40 అడుగుల ఎత్తు గల భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అభిమాని తెలిపారు. ఈ సారి తమ అభిమాన నాయకుడికి మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.