India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించడంతో సోమవారం ఉండి మండల టీడీపీ కార్యాలయం నుంచి కూటమి కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘు రామకృష్ణరాజుకు అత్యధిక మెజారిటీ అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘MLA సాబ్.. ఉండి గడ్డ TDP అడ్డా’ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఉండి జనసేన ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెళ్ళకూరు మండలం పాల్చూరు గ్రామంలో విషాదం చోటు చేసకుంది. విద్యుత్ తీగలు మరమ్మతులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం మీద నుంచి జారిపడి ఆనందయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు (55) మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలు, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాలలో హెల్త్ సూపర్వైజర్, మేల్ నర్స్, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ కడప జిల్లా కోఆర్డినేటర్ ఎల్. మాధవిలత తెలిపారు. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ సర్టిఫికెట్ ఉన్నవారు ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో స్థానిక బస్టాండ్ కూడలి వద్ద ఎమ్మెల్యే బెందాళం అశోక్ భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికలో గెలుపొంది మూడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ 40 అడుగుల ఎత్తు గల భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు అభిమాని తెలిపారు. ఈ సారి తమ అభిమాన నాయకుడికి మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యుడు బోద్దులూరి రంగారావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తనకు పదవి ఇచ్చారని, ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ పత్రాన్ని జిల్లా అధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు.

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని వెంగాయమ్మపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గోకవరం మండలం అరవపేట కాలనీకి చెందిన మండపాటి మణిరత్నం(33) బైక్పై జగ్గంపేట నుంచి గోకవరం వెళ్తుండగా వెంగాయమ్మపురం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

వైసీపీ నేతలకు విజయవాడ ఎంపీ సీటు కలిసిరావడం లేదు. 2014లో ఓడిపోయిన కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019లో బరిలో దిగి ఓటమి చవిచూసిన తర్వాత పీవీపీ రాజకీయాలకు దూరం అయ్యారు. ఇదే క్రమంలో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇలా మూడుసార్లు ఓడిపోయిన వారు YCP అభ్యర్థులే కావడం గమనార్హం. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నాని కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.

మన ఆంధ్ర-మన ఏపీఎల్ నూతన లోగోను విశాఖలో ఆవిష్కరించారు. ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆరు జట్లు, 11 మ్యాచులు, 120 మంది క్రీడాకారులతో నిర్వహిస్తున్నట్లు ఏపీఎల్ పాలక మండలి సభ్యులు మాంకో ఫెర్రర్, ఛైర్మన్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, కే.ఎస్ భరత్, రికీ భూయా పాల్గొన్నారు.

మానసిక స్థితి సరిగా లేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పార్వతీపురం మండలం చిన్నబొండపల్లిలో చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం బొడ్డవలస పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుడిగా చిట్టా పాపారావు (48) విధులు నిర్వహిస్తున్నారు. అతని మానసికస్థితి సరిగా లేక ఇంట్లో ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా మూడు పర్యాయాలు సిక్కోలు ప్రజల మన్ననలతో విజయం సాధించిన రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవితో జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నరసన్నపేటలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన కేంద్రమంత్రి పదవి చేపట్టడంతో జిల్లాకు మహర్దశ వస్తుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.