India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన బీఎన్ కండ్రిగ మండలంలో చోటుచేసుకుంది. SI ప్రతాప్ వివరాల ప్రకారం.. కంచనపుత్తూరునకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడైన బాలమురుగయ్య (26) మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంలో నివాసముంటూ వరదయ్యపాళెం SBI ఎదురుగా నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల అక్క హత్యకు గురికాగా మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అనంతపురం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 1,284 మద్యం కేసులు నమోదయ్యాయని అనంతపురం ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 1,272 మందిని అరెస్టు చేసి 206 వాహనాలు సీజ్ చేశామన్నారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చెక్ పోస్టులో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు.
నంద్యాల TDP MP అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి 1952లో తొలిసారిగా ఎన్నికలు జరగగా.. స్వతంత్ర అభ్యర్థి శేషగిరి రావు కాంగ్రెస్ అభ్యర్థి NR రెడ్డిపై 6,604 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004లో TDP తరఫున పోటీ చేసిన భూమా శోభానాగిరెడ్డి, నియోజకవర్గం నుంచి తొలి మహిళా MP అభ్యర్థిగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో శబరి పోటీ చేయనుండటంతో నంద్యాల నుంచి రెండో మహిళా ఎంపీ అభ్యర్థిగా నిలుస్తారు.
నెల్లూరులోని కోటమిట్టకు చెందిన మసూద్, బారకాసు సెంటర్ కు చెందిన సోహెల్ స్నేహితులు. ఫోన్ లో మాట్లాడుకునే సమయంలో వాగ్వాదం జరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. శనివారం రాత్రి సోహెల్ ఫోన్ చేసి పిలవడంతో మరొకరితో పాటు రంగనాయకులపేటకు మసూద్ వెళ్లాడు. అక్కడ మాటామాటా పెరగడంతో సోహెల్ తన స్నేహితులతో కలిసి మసూద్ ను కత్తితో పొడిచి పరారయ్యాడు. మసూద్ ను అస్పత్రికి తరలించారు. సంతపేట పోలీసులు విచారణ చేపట్టారు.
వజ్రాపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాల్లోని గ్రామాల్లో ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. జీడిపిక్కల కాలం కావడంతో సంచారిస్తున్నాయి. రైతులు, కూలీలు పనులకు వెళ్లాలంటే తీవ్ర భయాందోళన గురి అవుతున్నారు. శనివారం ఇద్దరిని ఎలుగు పొట్టన పెట్టుకుంది. అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేయకపోవడంతోనే దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్థానికంగా ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి.
జియ్యమ్మవలస మండలంలోని వెంకటరాజుపురం, గవరమ్మపేట గ్రామాల మధ్య ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అరటి, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏనుగులతో పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.
జనసేన టికెట్ దక్కించుకున్న పంచకర్ల రమేష్ బాబు 2009లో పెందుర్తి నుంచి మొదటిసారిగా ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎలమంచిలి నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2023లో వైసీపీలో చేరిన ఆయన జిల్లా అధ్యక్షుని పనిచేశారు. అనంతరం రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
వైసీపీ నాయకుల మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లమాడ మండలం దొన్నికోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి టీడీపీ, జనసేన, ఉమ్మడి అభ్యర్థికి పల్లె సిందూరకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బెట్టింగ్‌ల సమాచారాన్ని ఎవరైనా సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. డబ్బులకు అశపడి బెట్టింగులు ఆడి నష్టపోతే ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కవాతు నిర్వహించారన్నారు.
Sorry, no posts matched your criteria.