India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జడ్పీ మాజీ ఛైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్య రెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవాళ కుప్పం రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్‌తో కలిసి వైసీపీలో చేరారు.
వడదెబ్బ తగిలి అయ్యన్న అనే రైతు మృతి చెందిన ఘటన కోసిగి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. కోసిగిలోని 2వ వార్డుకు చెందిన అయ్యన్న కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పొలం పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులున్నారు.
ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పొలమూరి మోహన్ బాబు బీఎస్పీ తరఫున అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తనకు బీఎస్పీ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
పర్లాకిమిడి గజపతి రాజులుచే నిర్మించిన లివిరి గోపీనాధస్వామి ఆలయంలో ఒడిశా సంప్రదాయం ప్రకారం మంగళవారం హోలీ జరుపుకుంటారు. తిరువీధి, వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గోపినాధస్వామి హోలీ ఉత్సవానికి ఆంధ్రా, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పర్లాకిమిడి మహారాజు వంశీయులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన చింతాడ చెల్లమ్మ (46) పాము కాటుతో సోమవారం మృతి చెందింది. ఇటీవల పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.
అనకాపల్లి ఎంపీ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ను ఖరారు చేయగా.. వైసీపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో కాపు, గవర సామాజిక వర్గాలదే పైచేయి. అయితే ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.. వైసీపీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. మరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారని మీరు భావిస్తున్నారు..?
కందుకూరు పట్టణంలో సోమవారం వివాహిత దారుణ హత్యకు గురైంది. గాయత్రీ నగర్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న వనజాక్షి(27) ఇంట్లో రక్తపు మడుగులో చనిపోయి ఉంది. కుమార్తెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిన వనజాక్షి తండ్రికి ఆమె శవమై కనిపించింది. వనజాక్షి భర్తే హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ నఫీస్ బాషా కేసు దర్యాప్తు చేపట్టారు.
రోజురోజుకు చీరాల రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి వైసీపీ చీరాల టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై సోమవారం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ఆమంచికి మద్దతు కూడగట్టారు. ఇప్పటికే వైసీపీ చీరాల అభ్యర్థిగా కరణం వెంకటేశ్ ఖరారయ్యారు. దీంతో ఆమంచి స్థానికుడని.. ఆయనకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను ఇప్పుడు తెపైకి తెస్తున్నారు.
తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం వెంకటరెడ్డిపేటలో సోమవారం జరిగిన జాతరలో 2వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఇందులో రాంగోపాలపురానికి చెందిన సాయికుమార్(16) మృతిచెందాడని పోలీసులు తెలిపారు. జాతరలో భద్రాచలం, రాంగోపాలపురం గ్రామానికి చెందిన యువకులు రెండు వర్గాలుగా విడిపోయి దెబ్బలాడుకున్నారు. భద్రాచలం యువకులు కత్తులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సాయికుమార్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.
పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే సీటు BJPకి కేటాయిస్తున్నారనే మీడియాలో ప్రచారం జరగడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మీనాక్షినాయుడు నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దయచేసి మీడియాలో వచ్చిన కథనాలను నమ్మొద్దని.. ఇంకా అధికారికంగా ప్రకటన కాలేదని తెలిపారు. ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.