India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్ టీడీపీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. అయితే అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలోనూ ఆయనకు టికెట్ కేటాయించలేదు. అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రతికూలత రావడంతో గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆలూరుపై ఆశలు పెట్టుకున్న జయరాం కోట్ల సుజాతమ్మ మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
ఉమ్మడి ప.గోలోని 15స్థానాలకు ‘కూటమి’ తరపున జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. వారి విద్యార్హతలేంటో చూద్దాం.
☞ పోలవరం- చిర్రి బాలరాజు(బీఏ) (2వసారి బరిలో)
☞ నరసాపురం-బొమ్మిడి నాయకర్(డిగ్రీ) (2వ సారి బరిలో)
☞ ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు(ITI ఎలక్ట్రికల్) (తొలిసారి బరిలో)
☞ తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్(బీకాం) (2వసారి బరిలో)
☞ భీమవరం- పులపర్తి రామాంజనేయులు (ఇంటర్) (4వసారి పోటీ)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారానికి ప్రొద్దుటూరు నుంచి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 27న ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి, అనంతరం వేంపల్లె, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. బైపాస్ లోని వాసవి సర్కిల్ నుంచి, సినీహబ్, శివాలయం సర్కిల్, రాజీవ్ సర్కిల్, కొరప్రాడు రోడ్డు మీదుగా సభా స్థలి వద్దకు చేరుకుంటారు.
పలాస మండలం శాసనాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఐచర్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ.. వాహనాన్ని క్రేన్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
పట్టణంలోని శ్రీనగరాకాలనీ సమీపంలో ఒక ప్రైవేటు ఐటిఐ సమీపంలో జూదమాడుతున్న ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఆకస్మికంగా దాడి చేసి అరెస్టు చేశారు. వారిలో పట్టణానికి చెందిన హోంగార్డు మహేష్ ఉన్నారు. అతనితో పాటు పట్టణానికి చెందిన చిన్న, మురుగ, చందు ప్రకాష్, మధుకర్, మారిముత్తు, సామిదొరై, అరెస్టు చేసి వారి నుంచి రూ.5000, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెలలోనే ఈ ప్రయోగం చేపట్టాల్సివుంది . అయితే ఉపగ్రహ రాడార్ యాంటెన్నా రిఫ్లెక్టర్ కు అదనపు పూత అవసరమని శాస్త్రవేత్తలు భావించడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఆ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయోగం ఏప్రిల్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది.
తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లికి నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరాజు ఐచర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల నంద్యాలలో పెళ్లి సంబంధం కుదిరింది. కొన్ని కారణాలతో ఆ సంబంధం ఆగిపోయింది. దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో ఏడు రోజుల్లో రూ.75.74 కోట్ల వసూలు లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మొత్తం వసూళ్ల లక్ష్యం రూ.130.02 కోట్లు కాగా ఇప్పటికి రూ.54.,28 కోట్లు వసూలు చేశారు. పన్నులు చెల్లించాలని కోరుతూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలను వర్గపోరు వెంటాడుతోంది. ఇప్పటికే వైసీపీ రెబల్ అభ్యర్థిగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుకు వ్యతిరేకంగా పూనాటి రమేశ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. వర్గపోరును తట్టుకొని ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.
జనసేన పార్టీ ప్రకటించాల్సిన పెండింగ్ స్థానాల్లో ఒకటైన అవనిగడ్డలో అభ్యర్థి ఎవరనే టెన్షన్ కొనసాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తుది పరిశీలనలో పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనివాస్ పేర్లు ఉన్నాయి. అయితే బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిని అవనిగడ్డ MLA అభ్యర్థిగా బరిలో దింపి, MP అభ్యర్థిగా బండారు నరసింహారావును పోటీకి పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.