Andhra Pradesh

News March 25, 2024

అన్నమయ్య: అన్న ఎంపీగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ

image

రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన కిరణ్, కిషోర్‌లు తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. AP అసెంబ్లీ స్పీకర్, CMగా కిరణ్ బాధ్యతలు నిర్వర్తించారు. TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో పీలేరు అసెంబ్లీ స్థానానికి కిషోర్, రాజంపేట MP స్థానానికి కిరణ్ పోటీ పడుతున్నారు.

News March 25, 2024

టీడీపీలోకి కోవూరు ఎంపీపీ భర్త

image

కోవూరు మండల పరిషత్ అధ్యక్షురాలు పార్వతి భర్త చంద్ర తెలుగుదేశం పార్టీలో చేరారు. వేగూరుకు చెందిన చంద్ర ఆదివారం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు.

News March 25, 2024

శ్రీకాకుళం: విద్య అందరికీ అందుబాటులో ఉండాలి

image

విద్యారంగంలో లౌకిక భావజాలం అవసరమని, విద్య అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించాలని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలోని అంబేడ్కర్ కళా వేదికలో అప్పారి వెంకటస్వామి 23వ వర్ధంతి సందర్భంగా విద్యారంగం-లౌకిక భావజాలం అనే అంశంపై సదస్సు ఆదివారం నిర్వహించారు. సమాజంలో ఉత్పత్తి క్రమం ప్రారంభించి 12 వేల సంవత్సరాలు మాత్రమే అయిందన్నారు.

News March 25, 2024

అనంత: 25న మూల్యాంకనానికి హాజరుకావాలి:

image

ఈ నెల 26, 28వ తేదీన జరగాల్సిన ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం 25న నిర్వహిస్తున్నట్లు డీవీఈవో వెంకట నాయక్ తెలిపారు. 26న రసాయన శాస్త్రం, చరిత్ర 28న బాటనీ, జువాలజీ, కామర్స్ సబ్జెక్టుల మూల్యాంకనం జరగాల్సి ఉండగా ఆయా సబ్జెక్టులను 25నే నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధ్యాపకులు, అధికారులు హాజరుకావాలని కోరారు.

News March 25, 2024

శ్రీకాకుళం: ఐదో తరగతి ఫలితాలు విడుదల

image

జిల్లాలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2024-25 సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆదివారం ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థులు పొందిన మార్కులు, సీట్ల సంఖ్యకు అనుగుణంగా జాబితా రూపొందించామని జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ తెలిపారు. జిల్లాలో గల 8 అంబేడ్కర్ గురుకులాల్లో 640 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

News March 25, 2024

చిత్తూరు: అన్న ఎంపీగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన కిరణ్, కిషోర్ లు తక్కువకాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. AP అసెంబ్లీ స్పీకర్, CMగా కిరణ్ బాధ్యతలు నిర్వర్తించారు. TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో పీలేరు అసెంబ్లీ స్థానానికి కిషోర్, రాజంపేట MP స్థానానికి కిరణ్ పోటీ పడుతున్నారు.

News March 25, 2024

ప్రజల ఆస్తులు లాక్కునేందుకు కుట్ర: సీఎంపై బీటీ ఫైర్

image

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్‌రెడ్డి కుట్ర పన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆయన ఆదివారం కర్నూలులో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి జగన్‌రెడ్డి చేసిన చట్టమే కారణమన్నారు.

News March 25, 2024

చిత్తూరు: విద్యుత్తు బిల్లులు రూ.3 కోట్లు వసూలు

image

విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ పరిధిలో ఆదివారం ఒకరోజే రూ. 3 కోట్లు బిల్లులు వసూలయ్యాయని ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం సెలవురోజు బిల్లుల వసూలు కేంద్రాలు యధావిధిగా పనిచేశాయన్నారు. సోమవారం కూడా ఈ కేంద్రాలు పనిచేస్తాయని, వినియోగదారులు ఉపయోగించు కోవాలని చెప్పారు. వంద శాతం బిల్లుల వసూళ్లకు ఇంజినీర్లు, అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.

News March 25, 2024

విజయనగరం లోక్‌సభ స్థానం టీడీపీదే.!

image

పొత్తులో భాగంగా విజయనగరం లోక్‌సభ సీటు తొలుత BJP ఆశించింది. నిన్న ఆ పార్టీ ఆరుగురు MP అభ్యర్థులను ప్రకటించి.. విజయనగరానికి బదులు రాజంపేటలో మాజీ CM కిరణ్ కుమార్‌‌ను బరిలో నిలిపింది. దీంతో విజయనగరం నుంచి TDP పోటీ ఖరారైనట్లే. ఇక్కడి నుంచి కిమిడి కళా వెంకట్రావు, కిమిడి నాగార్జున పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ టికెట్ నర్సాపురం MP రఘురామరాజు ఆశిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

News March 25, 2024

తూ.గో జిల్లాలో విస్తృతంగా ఉపాధి పనులు

image

తూ.గో జిల్లాలో ఉపాధిహామి పనులు విస్తృతంగా చేపడుతున్నట్లు డ్వామా పీడీ ఎం.ముఖలింగం తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. జనవరి నెల వరకూ కూలీలకు బిల్లులు అందజేశామని అన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ఈ పథకం అమలుపై గ్రామ స్థాయి నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందడం లేదన్నారు. కూలీలతో పాటు, మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు వివరించారు.

error: Content is protected !!