India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో శుక్రవారం 15 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 1,848 మంది అభ్యర్థులకు గానూ 1,680 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు 168 మంది గైర్హాజరు అయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో తెలిపారు.

చేతివృత్తుల వారి అభ్యున్నతికి కేంద్రం చేపట్టిన ‘పీఎం విశ్వకర్మ’ పథకం నెల్లూరు జిల్లాలో మందకొడిగా సాగుతోంది. రెండేళ్లలో 77,190 దరఖాస్తులు రాగా.. 12730 రిజిస్ట్రేషన్ జరిగాయి. నిబంధనలతో 64,560 తిరస్కరణకు గురయ్యాయి. కేవలం 12,730 మందే అర్హత సాధించగా.. వారిలోనూ 2,618 మందికే రుణాలు, 4,011 మందికి టూల్‌కిట్లు అందాయి. శిక్షణ పూర్తయినవారికీ సకాలంలో ఆర్థికసాయం అందకపోవడంపై వృత్తిదారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందేలా చూస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ హామీ ఇచ్చారు. ‘సామ్నా’ జిల్లా నూతన కమిటీ సభ్యులు ఆయనను కలిసి అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్‌ను డీజీపీ హరీష్ గుప్తా అభినందించారు. గతంలో ఐటీ కోర్ ఎస్ఐగా పని చేస్తుండగా బాపట్ల రూరల్ పీఎస్ పరిధి సూర్యలంకలోని హరిత రిసార్ట్ వెబ్‌సైట్‌ను పోలిన ఫేక్ వెబ్ సైట్లు ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకోవడంలో నాయబ్ రసూల్ చేసిన కృషిని కొనియాడుతూ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అవార్డును డీజీపీ అందజేసి అభినందించారు. ఇదే ముఠాపై దేశ వ్యాప్తంగా 127 కేసులు ఉన్నాయి.

సాయుధ దళాల పతాక నిధి సేకరణలో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి రూ. 17,67,363 నిధులు సేకరించినందుకు గానూ కలెక్టర్ తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రశంసా పత్రం అందజేశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ జాబితాలో బాపట్ల ద్వితీయ, తూర్పు గోదావరి జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచాయి.

ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (DRC) నిర్వహణను సీరియస్‌గా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కోరారు. శుక్రవారం సాయంత్రం సుభాష్ అధ్యక్షతన DRC సమావేశం నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 4 గంటలకు ప్రారంభం కావడం పట్ల బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పరిశ్రమలు, తదితర అంశాల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో APIIC ద్వారా గత 2ఏళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని వారితో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

మంచిగా ఉండమని చెప్పినందుకు బంధువు నరసింహుడిని చంపిన నిందితుడు నాగరాజుకు శుక్రవారం ప్రొద్దుటూరు కోర్టు యావజ్జీవ శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. నిందితుడు తన బంధువును 2021లో జమ్మలమడుగులోని ఓ తోటలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో జడ్జి సత్యకుమారి శుక్రవారం శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

విశాఖ, కాకినాడలో ఆగస్టు నెలలో జరిగిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు సత్తాచాటారు. ఈ అగ్నివీరు రిక్రూట్‌మెంట్‌లో 25 మంది ఉద్యోగాలు సాధించినట్లు ఇటీవల కాల్ లెటర్స్ వచ్చాయని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్, NCC అధికారి పోలినాయుడు తెలిపారు. వీరిని శుక్రవారం అభినందించారు. NCCలో నైపుణ్య శిక్షణ, క్రమశిక్షణ, దేహదారుఢ్య శిక్షణ విద్యార్థులకు ఉపయోగపడిందన్నారు.

ఖరీఫ్ 2025-26లో జిల్లాలో 359 RSKల ద్వారా 37,800 రైతుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.373 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా మేనేజర్ బి.శాంతి శుక్రవారం తెలిపారు. అదనపు కిలోలు డిమాండ్ చేసిన పలు రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేసి, తూకంలో మోసాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.