India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం తెలుగు విద్యార్థి నేతలు గాజులు, చీరలతో అంబటి రాంబాబు నివాసం వద్దకు వెళ్లారు. కుర్చీపై అంబటి ఫొటో, గాజులు, చీర పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడు వంశీ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అంబటి రావాలని పిలిచేందుకు వచ్చామని అన్నారు.

దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆగస్టు వరకు పదవి కాలం ఉన్నప్పటికీ రాజీనామా లేఖను అధికారులకు అందించారు. ఛైర్మన్‌తో పాటు వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు కూడా రాజీనామాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నామినేటెడ్ పదవులకు కొత్త వారు రానున్న తరుణంలో నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని నేడు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. కాగా నిన్న కేంద్రమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో గన్నవరంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రేపు ఉదయం విజయవాడలోని A కన్వెన్షన్‌లో పార్టీనేతలతో సమావేశం కానున్నారు.

కొమరాడ మండలం పెద్ద కెర్జల వద్ద ఆటో బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం పెద్ద కెర్జల నుంచి కొమరాడ వెళ్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. 108కి సమాచారం అందించగా ఘటనా స్థలానికి మూడు అంబులెన్స్‌లు చేరుకున్నాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఆస్పత్రికి తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పర్చూరు మండలం రామనాయపాలెంకి చెందిన వంశీకృష్ణ దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ బీటెక్ పూర్తి చేశాడు. నాలుగేళ్లలో 20 సబ్జెక్టులు మిగిలాయని ఆదివారం చింతలపూడి కళాశాల సమీపంలోని ఓ పూరి గుడిసెలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరులో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సోమవారం నెల్లూరు మేయర్ శ్రవంతి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. నాలుగు నెలల క్రితం టీడీపీలో చేరిన మేయర్ దంపతులు మూడు రోజులు తిరిగేసరికి మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు.

వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో నిన్న రాత్రి టీడీపీ నేత గిరినాథ్ చౌదరి హత్య నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అదే సమయంలో వెల్దుర్తి సీఐ సురేశ్ కుమార్ రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్ రెడ్డిని VRకు పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. నూతన సీఐగా కర్నూలు సర్కిల్ పోలీస్ స్టేషన్ నుంచి మధుసూదన రావు, ఎస్సైగా కర్నూలు నాల్గో పట్టణ పోలీస్ ష్టేషన్ నుంచి సునీల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.

ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలనే EC ఆదేశాలతో వివాదం చెలరేగి చాలామంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి పరిస్థితి ఎటూ తేలని చందంగా ఉంది. కోనసీమలో నగరపాలక సంస్థ, 6 మున్సిపాలిటీలు, 21 మండలాల పరిధిలో 11,273 మంది వాలంటీర్లకు 10వేల మంది రాజీనామా చేశారు. 3నెలలుగా పనులు లేక, జీతాలు అందక వారందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొత్త ప్రభుత్వంలో మంచిరోజులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

ఓ వ్యక్తికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి దోచుకొని.. దాడిచేసిన ఘటన ఆదివారం జరిగింది. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలానికి చెందిన జవ్వాది శ్రీను(32) దేవరాపల్లిలోని అత్తారింటికి శనివారం రాత్రి బయలుదేరాడు. వావిలపాడు నుంచి దేవరాపల్లికి వెళ్తూ, దారిలో బైక్‌పై వస్తున్న వారిని లిఫ్ట్ అడిగాడు. వారు శారదానది వంతెనపై బైక్ ఆపి చాకు చూపిస్తూ పర్సు, సెల్‌ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. శ్రీను సెల్‌ఫోన్ ఇవ్వకపోవడంతో దాడిచేశారు.

బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రైతు బిడ్డ సతీశ్ రెడ్డి JEE ఓపెన్ కేటగిరీలో 175వ ర్యాంకు సాధించాడు. సతీశ్ రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. సతీశ్ రెడ్డి 8వ తరగతి నుంచి విజయవాడలో చదివాడు. ఐఐటీ సీటు సాధించాలనే లక్ష్యంతో చదివి, విజయం సాధించానని తెలిపాడు. సతీష్ రెడ్డి ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.