India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రైతు బిడ్డ సతీశ్ రెడ్డి JEE ఓపెన్ కేటగిరీలో 175వ ర్యాంకు సాధించాడు. సతీశ్ రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. సతీశ్ రెడ్డి 8వ తరగతి నుంచి విజయవాడలో చదివాడు. ఐఐటీ సీటు సాధించాలనే లక్ష్యంతో చదివి, విజయం సాధించానని తెలిపాడు. సతీష్ రెడ్డి ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

మామిడికాయల లోడుతో తిమ్మసముద్రం నుంచి వస్తున్న లారీ సోమవారం జమ్మలపాలెం వద్ద అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. తిమ్మసముద్రం నుంచి లోడుతో హైదరాబాద్ వెళుతున్న లారీ జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో లారీలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ఉండగా.. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గతంలో ఉద్దండులు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. తాజా మంత్రి వర్గంలో గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1974లో కాసు బ్రహ్మానంద రెడ్డి, 1979లో పాములపాటి అంకినీడు ప్రసాద్, 2004లో పనబాక లక్ష్మి, 2009లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా పనిచేశారు.

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న దాడుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటి ముందు ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని పీజీ(PG) విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. గత నెల 11 నుంచి వేసవి సెలవులు ప్రకటించగా నేటి నుంచి తరగతులు సందడిగా మారనున్నాయి. వేసవి సెలవులు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని అధికారులు సూచించారు. రెండు రోజుల కిందట ఎస్వీయూ ఉపకులపతి శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ నిరసన చేసిన విషయం తెలిసిందే.

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను సోమవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 249 మందిపై రూ.67,425 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 8 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 22 మందిపై జిల్లావ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.

తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై కుమార్తె ఆదివారం పొన్నలూరులో ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ వివరాల మేరకు.. రాజస్థాన్ కు చెందిన జక్సన్ సింగ్ బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం పొన్నలూరు వచ్చాడు. ఆదివారం రాజపుత్ర హేమ(15)ను తండ్రి టీ పెట్టమని కోరాడు. టీ సరిగ్గా లేదని మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి పైగదిలో ఉరేసుకుంది. గుర్తించిన జక్సన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టారు.

వైసీపీ నేతలు గతంలో చేసిన తప్పులను తిరిగి మనం చేయకూడదని ఎమ్మెల్యేగా ఎన్నికైన వరదరాజులరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని అందరం కలిసి కట్టుగా అభివృద్ధిపై దృష్టి పెడదామన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తనకు తెలిపి హుందాతనాన్ని చాటారన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి వెళ్లిపోయారని ఆరోపించారు.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి ఘటనను జనసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన గెలుపునకు శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి జరగడం సరికాదని, ఈ ఘటన వెనుక ఎవరున్నారు..? అనే దానిపై వివరాలు సేకరించాలని పవన్ ఆదేశించినట్లు నేతలు చెబుతున్నారు. వారంలో పవన్ పిఠాపురం రానున్నట్లు ఇప్పటికే నాగబాబు ప్రకటించారు.

విశాఖలోని కంచరపాలెం పరిధిలో దారుణ ఘటన చోటచేసుకుంది. సోమవారం ఉదయం కొంతమంది దుండగులు అదే ప్రాంతానికి చెందిన ఉదయ్( 20)పై కత్తితో మెడపై దాడి చేశారు. దీంతో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.
Sorry, no posts matched your criteria.