Andhra Pradesh

News June 10, 2024

వన్నెపూడి ఘటనపై పవన్ సీరియస్..!

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి ఘటనను జనసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన గెలుపునకు శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి జరగడం సరికాదని, ఈ ఘటన వెనుక ఎవరున్నారు..? అనే దానిపై వివరాలు సేకరించాలని పవన్ ఆదేశించినట్లు నేతలు చెబుతున్నారు. వారంలో పవన్ పిఠాపురం రానున్నట్లు ఇప్పటికే నాగబాబు ప్రకటించారు.

News June 10, 2024

సిక్కోలుకు 4వసారి కేంద్ర మంత్రి పదవి

image

సిక్కోలు జిల్లా నేతలకు నాల్గవసారి కేంద్ర మంత్రి పదవి లభించింది. 1952లో పాతపట్నం పార్లమెంట్ స్థానం నుంచి వరహగిరి వెంకటగిరి గెలిచి జవహర్‌లాల్ నెహ్రూ కేబినెట్‌లో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా చేశారు. 1996లో కింజరాపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. 2012లో కిల్లి కృపారాణి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

News June 10, 2024

కర్నూలు: తుంగభద్ర నది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం

image

మంత్రాలయంలోని తుంగభద్ర నది ఒడ్డున ఆదివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్సై గోపీనాథ్ తెలిపారు. హెచ్ఆర్‌బీ కళ్యాణ మండపం వెనుక భాగంలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డున రెండు బండరాళ్ల మధ్యలో మృతదేహం లభ్యమైందని చెప్పారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవని, ఎవరికైనా తెలిసి ఉంటే వివరాలు తెలియజేయాలని కోరారు.

News June 10, 2024

గుంటూరు: చంద్రబాబు ప్రమాణస్వీకారం..14 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు

image

ఈనెల 12న ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5ఎకరాల్లో ప్రధాన వేదిక, VIP గ్యాలరీ, మిగిలిన 11.5ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.

News June 10, 2024

విజయవాడ: చంద్రబాబు ప్రమాణస్వీకారం..14 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు

image

ఈనెల 12న ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5ఎకరాల్లో ప్రధాన వేదిక, VIP గ్యాలరీ, మిగిలిన 11.5ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.

News June 10, 2024

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నెల్లూరు విద్యార్థుల హవా

image

తాజాగా వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో మొత్తం 2,800 మంది విద్యార్థులు పాల్గొంటే.. 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో నెల్లూరులోని ధనలక్ష్మీపురానికి చెందిన సూరజ్ 134, మూలాపేటకు చెందిన బద్రీనాథ్ వర్మ 236 ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు.

News June 10, 2024

గిద్దలూరులో తీవ్ర విషాదం

image

గిద్దలూరులో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని HP పెట్రోల్ బంక్ సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెంట్ హౌస్ సప్లయర్స్ ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 10, 2024

సిక్కోలుకు 4వసారి కేంద్ర మంత్రి పదవి

image

సిక్కోలు జిల్లా నేతలకు నాల్గవసారి కేంద్ర మంత్రి హోదా లభించింది. 1952లో పాతపట్నం పార్లమెంట్ స్థానం నుంచి వరహగిరి వెంకటగిరి జవహర్ లాల్ నెహ్రూ కేబినెట్‌లో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. కింజరాపు ఎర్రన్నాయుడు 1996లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా చేశారు. కిల్లి కృపారాణి 2012లో కేంద్ర సహాయ మంత్రిగా బాధత్యలు నిర్వర్తించారు. తాజాగా రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినేట్‌లో స్థానం పొందారు.

News June 10, 2024

పార్వతీపురంలో వివాహిత సూసైడ్

image

చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన పార్వతీపురంలోని పార్వతీ నగర్‌లో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతాడ కుమారి (42) వ్యక్తిగత కారణాలవల్ల శుక్రవారం ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లి జిల్లా ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

News June 10, 2024

విశాఖ: 10 లక్షల మొక్కలు నాటాలని పోర్టు నిర్ణయం

image

విశాఖ పోర్ట్ అథారిటీ నగరవ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కాలుష్య నివారణకు విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. రూ.15 కోట్లతో పోర్టుకు చెందిన 186 ఎకరాల్లో మొక్కలు పెంచుతామన్నారు.