India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల మఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగాణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

JEE అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. టాప్-10లో 2 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఆదోనికి చెందిన బీ.సందేశ్ 360 మార్కులకు 338 సాధించి మూడో ర్యాంకు, కర్నూలు గణేశ్‌నగర్‌కు చెందిన కే.తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు సాధించారు. ఆళ్లగడ్డ మండలం పాతకందుకూరుకు చెందిన పీ.రాజేశ్ కుమార్ 36వ, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన ఎం.యశ్వంత్ రెడ్డి 50వ ర్యాంకులు పొందారు.

ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల మఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగాణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

సోమందేపల్లి మండల కేంద్రంలోని బుసయ్యగారి పల్లికి చెందిన సోమశేఖర్ ఆదివారం మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమశేఖర్‌కు కొడుకు, కుమార్తె సంతానం ఉన్నారన్నారు. కుమార్తెకు ఈనెల 8న వివాహం నిశ్చయం కాగా.. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతో ఉరేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.

చిత్తూరు జిల్లాలో తాజా ఎన్నికల్లో వైసీపీ, కూటమి అభ్యర్థుల దెబ్బకు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. చిత్తూరు లోక్ సభ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో 17 మంది డిపాజిట్లు కోల్పోయారు. మరోవైపు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో 78 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రతి చోటా వైసీపీ, కూటమి నేతలు మినహా మిగిలినవారు డిపాజిట్లు కోల్పోయారు.

ఉమ్మడి ప.గో-తూ.గో జిల్లాను కలుపుతూ గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు దాదాపు 70KM పొడవున రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించిన హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. హైవే ఎక్కాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రూట్లో దేవరపల్లి మండలం డేంజర్ స్పాట్. ఈ మార్గంలో 2023 JAN నుంచి 2024 మే వరకు (17 నెలలు) దాదాపు 156 ప్రమాదాలు జరగ్గా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలపాయ్యారు.

రాయచోటి మండలం బోయపల్లి గ్రామంలో టీడీపీ వర్గీయులపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. బోయపల్లె గ్రామంలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నప్పుడు, వైసీపీకి చెందిన వారు దాడి చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు దాడికి దిగిన 16 మంది వైసీపీ వర్గీయులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గాజువాకలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో రోలుగుంట ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్ పీవీఎం.నాగజ్యోతి 3 బంగారు పతకాలు సాధించారు. పవర్ లిఫ్టింగ్‌లోని మూడు విభాగాలలో బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వేట్ పాల్గొని మూడింటిలోనూ బంగారు పతకాలు సాధించారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు.
ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె గతంలో అంతర్జాతీయ, జాతీయ మెడల్స్ సాధించారు.

పర్చూరు మండలం రామనాయపాలెం గ్రామానికి చెందిన వంశీకృష్ణ(24) చింతలపూడిలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదివాడు. నాలుగేళ్లలో 20 సబ్జెక్టులు మిగిలాయి. పరీక్షలు రాయడానికి రెండు రోజుల కిందట చింతలపూడి వచ్చాడు. ఆదివారం ఉదయం కాలేజీ సమీపంలోని ఒక పూరి గుడిసెలో ఉరి వేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సబ్జెక్టులు ఉండటమే ఆత్మహత్యకు కారణమని వారు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.